సాక్షి, హైదరాబాద్: విత్తన ఉత్పత్తి, ఎగుమతులలో సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా తెలంగాణ మారాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జాతీయ విత్తన సదస్సులో విత్తన ఉత్పత్తి, నాణ్యత, నియంత్రణ, మార్కెటింగ్‌పై మంత్రి మాట్లాడారు.
ప్రస్తుతం దేశ విత్తన అవసరాలలో సింహ భాగం తెలంగాణ రాష్ట్రమే తీరుస్తోందని చెప్పారు. నేలలు, మంచి వాతావరణం ఉండటం తెలంగాణకు అనుకూలమని అన్నారు. ప్రస్తుతం కొన్ని రకాల విత్తనాలను కొద్ది మొత్తంలో విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని, భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతులు చేయాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment