'ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ'
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా మారుస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీగా మారుస్తామన్నారు. వ్యవసాయం లాభసాటి కాదన్న అపోహలు ప్రజల నుంచి తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
త్వరలో ఆదర్శ రైతులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్య పెంచుతామన్నారు. అలాగే వ్యవసాయదారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. రైతులకు అర్థమయ్యే భాషలోనే పరిశోధనలు, ఇతర అంశాలను భోదించాలని శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ సూచించారు.