Seed Bowl of the World
-
సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా తెలంగాణ: పోచారం
సాక్షి, హైదరాబాద్: విత్తన ఉత్పత్తి, ఎగుమతులలో సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా తెలంగాణ మారాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జాతీయ విత్తన సదస్సులో విత్తన ఉత్పత్తి, నాణ్యత, నియంత్రణ, మార్కెటింగ్‌పై మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం దేశ విత్తన అవసరాలలో సింహ భాగం తెలంగాణ రాష్ట్రమే తీరుస్తోందని చెప్పారు. నేలలు, మంచి వాతావరణం ఉండటం తెలంగాణకు అనుకూలమని అన్నారు. ప్రస్తుతం కొన్ని రకాల విత్తనాలను కొద్ది మొత్తంలో విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని, భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతులు చేయాలని ఆకాంక్షించారు. -
'ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ'
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా మారుస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీగా మారుస్తామన్నారు. వ్యవసాయం లాభసాటి కాదన్న అపోహలు ప్రజల నుంచి తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలో ఆదర్శ రైతులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గోదాముల సంఖ్య పెంచుతామన్నారు. అలాగే వ్యవసాయదారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. రైతులకు అర్థమయ్యే భాషలోనే పరిశోధనలు, ఇతర అంశాలను భోదించాలని శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ సూచించారు.