
అవగాహనకు హాజరైన బధిరుల తల్లిదండ్రులు
ఖమ్మం మామిళ్లగూడెం : మూగ, చెవిటి విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నట్లు ఐడీఎల్ స్కూల్ ఫర్ డిజబుల్డ్(ఐఐసీడీ) కార్యదర్శి తబ్రేజ్ తెలిపారు. మంగళవారం బధిరులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని అజంపురాలో గల పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు మూగ, చెవిటి, మానసిక వికలాంగులకు ఉచిత విద్య, హస్టల్ వసతితో పాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం అందిస్తామన్నారు.
కుల మతాలకు అతీతంగా ఈ పాఠశాల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. భాషలో ప్రావీణ్యులైన అధ్యాపకుల పర్యవేక్షణలో మూగభాషతో పాటు కంప్యూటర్ పాఠాలు కూడా బోధిస్తారని అన్నారు. ఇతర వివరాలకు సెల్ నెం.9059619641కు ఫోన్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment