న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయ పన్ను శాఖ తాజాగా ఏఐఎస్ ట్యాక్స్‌పేయర్ పేరిట మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో తమ మొబైల్ ఫోన్‌లలో వార్షిక సమాచారాన్ని, పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశాని చూడవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారుల టీడీఎస్/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్లు, షేర్ల లావాదేవీలు మొదలైన వాటి సమగ్ర సమాచారాన్ని ఒకే దగ్గర చూసుకునేందుకు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.
టీఏఎస్ అంటే టేక్స్ పేయర్స్ ఇన్‌ఫర్మేషన్ సమ్మరీని, ఏఐఎస్ యాన్సువల్ ఇన్‌ఫర్మేషన్ స్టేట్‌మెంట్ వివరాలు ఉంటాయి. ఈ సమాచారం అందించే యాప్ గూగుల్ ప్లే, యాప్ స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. తమ పాన్ నంబర్ ద్వారా ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ITD has launched a mobile app ‘AIS for Taxpayers’ to enable taxpayers to view their info as available in Annual Information Statement(AIS)/Tax Information Summary(TIS).
— Income Tax India (@IncomeTaxIndia) March 22, 2023
This will provide enhanced taxpayer service & ease of compliance.(1/2)
Press Release:https://t.co/WujCqyYQSe pic.twitter.com/Q6VaC2L2S2
Comments
Please login to add a commentAdd a comment