హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమానికి స్థానికులే కాకుండా స్థానికేతరులు కూడా హాజరై పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ సంఘటనలు స్థానికులను, అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రానికి ఓ నేపాలీ కుటుంబం తమకు కూడా రూ.500లకు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలు వర్తింపజేయాలంటూ దరఖాస్తులు అందజేశారు.
నేపాల్‌కు చెందిన దుర్గా, బును దంపతులు జూబ్లీహిల్స్‌లో అద్దెకుంటూ స్థానికంగా హోటల్‌లో పని చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మేం ఇక్కడే పుట్టి పెరిగామని, మాకు కూడా తెల్లరేషన్ కార్డు కూడా ఉంది, ఇటీవల ఎన్నికల్లో ఓటు కూడా వేశాం, ఆధార్ కార్డు సైతం పొంది ఉన్నామని అందుకే మాక్కూడా అభయహస్తం పథకాలు ఇవ్వాలంటూ తమ దరఖాస్తును అధికారులకు అందజేశారు. వీరిచ్చిన దరఖాస్తును సంబంధిత అధికారులు స్వీకరించి వారికి రశీదు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment