హైదరాబాద్: అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలకు పలుచోట్ల ప్రజలు వెల్లువలా వస్తుంటే..మరికొన్ని చోట్ల దరఖాస్తులు దారులు లేక క్యూ లైన్లు వెలవెలబోతున్నాయి. శనివారం బంజరాహిల్స్‌రోడ్ నెం.12లోని బడాబాబులు నివసించే వేమిరెడ్డి ఎన్‌క్లేవ్ నివాసితుల కోసం ప్రజాపాలన కేంద్రాన్ని బంజారాహిల్స్ రోడ్ నెం.13లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈ కాలనీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి అధికారులు వెళ్లిపోయారు.
మరోవైపు జూబ్లీహిల్స్ రోడ్ నెం 72లోని ప్రశాసన్‌నగర్ కాలనీవాసుల కోసం శనివారం జూబ్లీహిల్స్ క్లబ్ ఎదురుగా ఉన్న వార్డు కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కాలనీ నుంచి కూడా ఒక్క దరఖాస్తు అందలేదు. బస్తీవాసులు ఉంటున్న ప్రాంతాల్లో ప్రజాపాలన కేంద్రాలు కిక్కిరిసిపోతుండగా కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ లెక్కన చూస్తే కాలనీవాసులకు పెద్దగా సమస్యలు లేనట్లే.
Comments
Please login to add a commentAdd a comment