న్యూఢిల్లీ: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూఎస్‌ఎఫ్‌బీ) పూర్తి స్థాయి బ్యాంక్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్‌బీఐ) దరఖాస్తు సమర్పించింది. కనీస నికర విలువ రూ. 1,000 కోట్లతో సహా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న చిన్న ఆర్థిక బ్యాంకులు.. పూర్తి స్థాయి బ్యాంక్‌లుగా మారడానికి ఏప్రిల్‌లో ఆర్‌బీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు అనుగుణంగా దరఖాస్తు సమర్పించినట్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక బీఎస్‌ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ప్రైవేట్ రంగంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ) పూర్తి స్థాయి బ్యాంకుగా మారడానికి సంబంధించిన లైసెన్సింగ్ మార్గదర్శకాలను నవంబర్ 2014లో ఆర్‌బీఐ జారీ చేసింది. జైపూర్‌కు చెందిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ ఏడాది మొదట్లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి విలీనం అమల్లోకి వచ్చింది. దీనితో విలీన సంస్థ మొత్తం వ్యాపార పరిమాణం రూ. 1.8 లక్షల కోట్లు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment