న్యూఢిల్లీ: ఐటీ హార్డ్‌వేర్ ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రూ. 4.65 లక్షల కోట్ల విలువ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, సర్వర్లు మొదలైనవి తయారు చేసేందుకు 40 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. అవన్నీ ఎంపికైన పక్షంలో ప్రోత్సాహక మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించిన రూ. 17,000 కోట్లకు మించి రూ. 22,890 కోట్లకు పెంచాల్సి వస్తుందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
‘గడువు తేదీ ఆగస్టు 30 నాటికి 40 దరఖాస్తులు వచ్చాయి. రూ. 3.35 లక్షల కోట్ల తయారీ లక్ష్యాలకు మించి రూ. 4.65 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేశాయి‘ అని పేర్కొంది.
డెల్, హెచ్‌పీ వంటి బడా ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలు నేరుగా, హెచ్‌పీఈ, లెనొవొ, ఏసర్, అసూస్, థామ్సన్ వంటివి దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్లు ఉన్న కంపెనీల ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా వాటిల్లో యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్, ప్యాడ్‌జెట్ (డిక్సన్), వీవీడీఎన్, నెట్‌వెబ్, ఆప్టీమస్, సహస్ర, సోజో (లావా) మొదలైనవి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment