న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో (జనవరి–జూలై) 59 న్యూ ఫండ్ ఆఫర్లకు (ఎన్‌ఎఫ్‌వోలు) సంబంధించి సెబీ వద్ద దరఖాస్తు దాఖలు చేశాయి. అధిక పోటీతో కూడిన వాతావరణం నేపథ్యంలో ఎన్‌ఎఫ్‌వోల రాక తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది మొదటి ఏడు నెలల్లో 70 ఎన్‌ఎఫ్‌వోలు రావడం గమనార్హం. ఇక గతేడాది మొత్తం మీద వచ్చిన కొత్త పథకాలు 228గా ఉన్నాయి. 140 ఎన్‌ఎఫ్‌వోలు 2021లో వచ్చాయి.
ఇక ఈ ఏడాది మొత్తం మీద ఎన్‌ఎఫ్‌వోలు.. గత రెండు సంవత్సరాల కంటే తక్కువే ఉండొచ్చన్న అభిప్రాయాన్ని ఎస్‌ఏఎస్ ఆన్‌లైన్ సీఈవో శ్రేయజైన్ వ్యక్తం చేశారు. దీనికి పలు అంతర్గత, వెలుపలి అంశాలు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) కొత్త పథకాల కంటే కూడా ప్రస్తుత పథకాల నిర్వహణ, వాటికి ప్రచారం కలి్పంచుకోవడంపై దృష్టి సారించి ఉండొచ్చు.
ఈ విధానంతో ప్రస్తుత ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు ఇవ్వడంతోపాటు, తమ నిర్వహణలోని ఆస్తులు స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి వీలు లభిస్తుంది’’అని జైన్ పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ గరిష్ట స్థాయిలకు చేరుకోవడం కూడా ఎన్‌ఎఫ్‌వోలు తగ్గడానికి కారణమై ఉంటుందని.. ఇక్కడి నుంచి మార్కెట్ దిద్దుబాటుకు గురికావచ్చని ఫండ్స్ భావిస్తుండొచ్చన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ప్యాసివ్ ఫండ్స్ ఎన్ని అయినా ప్రారంభించుకునే అవకాశం ఉంది. కానీ, విభాగాల వారీగా యాక్టివ్ ఫండ్స్ విషయంలో పరిమితి ఉంది’’అనే విషయాన్ని ట్రస్ట్ ఎంఎఫ్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ గుప్తా తెలిపారు.
రూ.20,000 కోట్లు
ఈ ఏడాది నూతన ఫండ్ ఆఫర్ల ద్వారా జూలై వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం రూ.20,000 కోట్లుగా ఉంది. 2022లో రూ.62,187 కోట్లు, 2021లో రూ.99,704 కోట్లు, 2020లో రూ.53,703 కోట్ల చొప్పున ఫండ్స్ నిధులు సమీకరించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది కొత్త పథకాల్లో ప్యాసివ్, యాక్టివ్ రెండు విభాగాల నుంచి ఉన్నాయి.
నూతన పథకాల ఆవిష్కరణలో అప్రమత్తత
Published Mon, Sep 4 2023 6:18 AM | Last Updated on Mon, Sep 4 2023 6:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment