గుట్టలుగా దరఖాస్తులు | Applications For Voter Lists Mistakes | Sakshi
Sakshi News home page

గుట్టలుగా దరఖాస్తులు

Published Fri, Mar 1 2019 1:29 PM | Last Updated on Fri, Mar 1 2019 1:29 PM

Applications For Voter Lists Mistakes - Sakshi

ఆన్‌లైన్‌లో గుట్టలు గుట్టలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. కొత్తగా ఓటు హక్కు కోసం.. జాబితాల్లో చేర్పులు, మార్పులు.. ఉన్న ఓట్ల రద్దు.. ఇలా వెల్లువెత్తుతున్న దరఖాస్తులతో అధికారులు విస్తుపోతున్నారు. ఈ దరఖాస్తులు ఒక్కని పేరుతోనే వేల సంఖ్యలో వస్తుండటంతో ఏవి వాస్తవమో.. ఏవి తప్పుడువో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వాటిని పరిష్కరించాలో.. వద్దో తెలియక సతమతమవుతున్నారు. వచ్చిన సమాచారంతో పరిష్కరిస్తే ఎక్కడ సైబర్‌ నేరం తలకుచుట్టుకుంటుందోనని భయపడుతున్నారు. మరికొందరు మాత్రం అధికార పార్టీ నేతల ఒత్తిడితో అక్రమ దరఖాస్తులను సైతం ఆమోదించి దొంగ ఓట్లను చేరుస్తూ, వైఎస్సార్‌ సీపీ ఓట్లను తొలగిస్తున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో: కొత్తగా ఓటు హక్కు కోసం, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఓట్ల తొలగింపు కోసం ఆన్‌లైన్‌లో గుట్టలు గుట్ట లుగా దరఖాస్తులు నమోదువుతున్నాయి. చనిపోయిన వారి ఓట్లు తొలగించాలంటూ ఒక వ్యక్తి ఏకంగా 40,50 దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయడంతో అధికారులు తలలు పట్టుకొంటున్నారు. మరో వైపు అధికార పార్టీ నేతలు కొందరు బీఎల్వోల సహకారంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఓట్ల తొలగింపు కోసం ఎవరైనా ఫారం–7 సమర్పిస్తే సంబం«ధిత బీఎల్వోలు ఆ దరఖాస్తులను పరిశీలించి, చనిపోయిన వారి కుటుంబ సభ్యుల సంతకం తీసుకొని, నివేదిక తయారుచేసిన అనంతరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అ«ధికారికి పంపాల్సింది. రిటర్నింగ్‌ అధికారి ఆ నివేదికను పరిశీలించాక ఓట్లు తొలగింపుకు సిఫారసు చేస్తారు. ఓటర్ల తుది జాబితా 2019 జనవరిలో విడుదల చేశారు. ఆ తరువాత ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కోసం 3,84,236 దరఖాస్తులు వచ్చాయి. ఫారం–6 కింద 2,23,773 దరఖాస్తులు రాగా ఇప్పటికి 65,519 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఫారం–6ఏ కింద 1,484 దరఖాస్తులు రాగా 125, ఫారం –7 కింద 1,09,079 దరఖాస్తులు రాగా 14,302, ఫారం–8 దరఖాస్తులు 40,311 రాగా 25,928, ఫారం–8ఏ కింద 9,589 దరఖాస్తులు రాగా 3,899 పరిష్కారమయ్యాయి. మొత్తం 3,84,236 దరఖాస్తులకు 1,09773 దరఖాస్తులను అధికారులు పరిష్కరిం చారు. మిగిలిన 2,74,463 దరఖాస్తులు విచారణ దశలో అంటే పెండింగ్‌లో ఉన్నాయి.

గురజాల అత్యధికం
జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పుల కోసం గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా 36,207 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా బాపట్లలో 10,377 దరఖాస్తులు నమోదయ్యాయి. పెదకూరపాడులో 23,460, తాడికొండలో 15,558, మంగళగిరిలో 20,256, పొన్నూరులో 19,034, రేపల్లెలో 17,794, మాచర్లలో 22,652, ప్రత్తిపాడులో 25,391, గుంటూరు వెస్ట్‌ 34,864, గుంటూరు ఈస్ట్‌ 26,439, చిలకలూరిపేట 24,824, నరసరావుపేట 20,662, సత్తెనపల్లి 25,110, వినుకొండ నియోజకవర్గంలో 21,281 దరఖాస్తులు  అందాయి. ఓట్లు తొలగించాలని  గుంపగుత్తగా దరఖాస్తులు వస్తున్నాయి.

కఠిన చర్యలు తీసుకోవాలి
ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులకు సంబంధించి బీఎల్వోల అండతో అధికార పార్టీనేతలు రెచ్చిపోతున్నారు. అడ్డగోలు చేర్పులు, మార్పులు, తొలగింపులపై కలెక్టర్‌ కోనశశిధర్‌కు వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గురజాల సమన్వయకర్త కాసుమహేష్‌రెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు గురువారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల అండతో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కలెక్టర్‌ దృష్టి తెచ్చారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement