బతికుండగానే నూతన ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు చూపిస్తున్న పేర్లు
పిడుగురాళ్లరూరల్: అధికార పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందిన ఓట్లను గల్లంతు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. అందుకు నిదర్శనమే పిడుగురాళ్ల పట్టణం, మండలంలోని ఓటర్ల జాబితా తగ్గడమే. 2017 ఓటర్ల జాబితా ప్రకారం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో 51,784 మంది ఓటర్లు ఉన్నారు. అదే విధంగా మండలంలోని 14 గ్రామాల్లో 46,889 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2018 ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే ఒక్కసారిగా పట్టణం, మండలంలో 6796 ఓట్లు గల్లంతయ్యాయి. ఇందులో బతికి ఉన్న వారిని కూడా చచ్చినట్లుగా చిత్రీకరించి ఓట్లను తొలగించారు.
జీవించి ఉన్నా.. జాబితాతో చంపేశారు
బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యర్రంరెడ్డి గురవమ్మ(70) జీవించే ఉన్నప్పటికీ ఆమె చనిపోయినట్లు ఓటును తొలగించారు. ఇదే గ్రామానికి చెందిన యర్రంరెడ్డి తిరుపతమ్మ(90) కూడా జీవించే ఉన్నా, ఆమె కూడా చనిపోయినట్లు ఓటును తొలగించారు. ఉద్యోగ రిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్తే ఊరు వదలిపెట్టి పోయారని, బతికున్న వారిని చనిపోయారని రిపోర్టు రాసుకుని ఓట్లను తొలగించారు. ఈ క్రమంలోనే మండలంలోని 14 గ్రామ పంచాయితీల్లో 389 ఓట్లను తొలగించారు. పట్టణంలో 6407 ఓట్లు పలు కారణాలతో తొలగించారు. తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్సార్‌సీపీకి మద్దతుదారులు కావడం విశేషం.
మళ్లీ చేరుస్తాం..
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే ఓటర్లు ఫారం 6ఏ పూర్తి చేసి తహసీల్దార్ కార్యాలయంలో అందిస్తే మళ్లీ చేరుస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారు.
ఎంత దుర్మార్గం
నేను చనిపోయినట్లు చూపించి ఓటు తొలగించడం ఎంత దుర్మార్గం. మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులం కనుకే నా ఓటును తొలగించారు. నా భర్త యర్రంరెడ్డి యేగిరెడ్డి బ్రాహ్మణపల్లి, కామేపల్లి జంట గ్రామాలకు సర్పంచిగా పని చేశారు. అదేవిధంగా స్వతంత్య్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కాగడ గుర్తుపై పోటీ చేశారు. మేము అంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉండటంతోనే నా ఓటును తొలగించారు.
– యర్రంరెడ్డి గురవమ్మ
Comments
Please login to add a commentAdd a comment