సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు మంత్రులు చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. విధి విధానాల ఖరారు పూర్తిస్థాయిలో కొలిక్కిరాలేదు. దీంతో మరోసారి భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సాగు భూమికి రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇవ్వాలనే చర్చ జరిగింది.
పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతు భరోసా అమలు తీరు, కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు. కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment