
కైరా అద్వాని
తమిళసినిమా: విజయ్‌తో రొమాన్స్‌కు మహేశ్‌బాబు హీరోయిన్ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సర్కార్. విజయ్ తన తాజా చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకు ముందు ఆయనకు తెరి, మెర్షల్ వంటి సంచలన విజయాలను అందించిన యువ దర్శకుడు అట్లీతో ముచ్చటగా మూడోసారి కలవనున్నారు.
ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. సంగీత మాంత్రికుడు సంగీత బాణీలను కట్టనున్నారన్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇతర తారాగణం ఎంపికపై దృష్టిసారించారు. ఇందులో కైరా అద్వాని రొమాన్స్ చేయనున్నట్లు తాజా సమాచారం. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంతకు ముందు భారత క్రికెట్ క్రీడ కెప్టెన్ ఎంఎస్.ధోని బయోపిక్‌లో నటించింది. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణను అందుకుంది. ఆ తరువాత తెలుగులో మహేశ్‌బాబుకు జంటగా భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఇలా లక్కీ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న కైరా అద్వాని తాజగా విజయ్‌కు జంటగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment