సర్కార్‌ చిత్ర పోస్టర్‌పై రగడ | Issues On Vijay Sarkar Movie Poster | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 24 2018 8:02 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Issues On Vijay Sarkar Movie Poster - Sakshi

హీరో విజయ్‌

హీరో విజయ్‌ చిత్రంపై మొదట్లోనే రాజకీయ రగడ మొదలైంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్‌ పోస్టర్‌లో విజయ్‌ సిగరెట్‌ కాలుస్తున్న దృశ్యం రచ్చకు దారి తీసింది. హీరో విజయ్‌పై కోర్టులో పిటిషన్‌ దాఖలుకు సిద్ధం అవుతున్నారు పొగాకు నిరోధక సంఘం. సినిమాల్లో మద్యం, పొగ తాగే సన్నివేశాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇతర చిత్రాల గురించి పట్టించుకోకపోయినా రజనీకాంత్, విజయ్‌ వంటి నటుల చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటే వాటిపై కేసులు, కోర్టులు అంటూ రచ్చ జరుగుతుంది. అయితే వారి ఇమేజ్‌ కారణంగా ఇలాంటి దురలవాట్ల ప్రభావం యువతలోకి వేగంగా చేరుతుందని సమాచారం. 

తాజాగా విజయ్‌ నటించిన సర్కార్‌ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఆయన సిగరెట్టు కాల్చుతున్న ఫొటో చోటుచేసుకోవడం దుమారానికి కారణమైంది.ఈ వ్యవహారంపై పొగాకు నియంత్రణ సంఘం నిర్వాహకుడు గ్రిల్‌ అలెగ్జాండర్‌ విజయ్‌పై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. దీని గురించి ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘హీరో విజయ్‌ తన ముందు చిత్రంలోనూ పొగతాగే సన్నివేశాల్లో కనిపించారు. తాజాగా నటిస్తున్న సర్కార్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఆయన సిగరెట్‌ తాగుతున్నట్టు కనిపించారు. ఇది పొగాకు నియంత్రణ చట్ట ధిక్కార చర్యగా పేర్కొన్నారు. 

పొగ త్రాగడం అనారోగ్యకరం వంటి యువతలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటే విజయ్‌ లాంటి నటులు పొగతాగడాన్ని పోత్సహించే విధంగా ఆరోగ్యానికి హాని కలిగించేలా చిత్రాల్లో నటిస్తున్నారు. కాబట్టి విజయ్‌పై తగిన చర్యలు తీసుకోవలసిందిగా పొగాకు నిరోధక రాష్ట్ర పర్యవేక్షణ కమిటీకి, సెన్సార్‌బోర్డుకు లేఖ రాశారు. అదే విధంగా విజయ్‌పై న్యాయస్థానంలో పిటిషన్‌ వేయనున్నట్లు’ గ్రిల్‌ అలెగ్జాండర్‌ తెలిపారు. సర్కార్‌ పోస్టర్‌లో సిగరెట్‌ కాలుస్తున్నట్లు విజయ్‌ స్టిల్‌పై పీఎంకే నేత అన్భుమని రామదాస్‌ ఇప్పటికే సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌పై ఇంకా ముందు ముందు ఎలాంటి రచ్చ జరగనుందో వేచిచూడాల్సిందే!

రజనీ అభిమానుల ఆగ్రహం..
రజనీకాంత్‌ అభిమానులు, విజయ్‌ అభిమానులపై మండిపడుతున్నారు. సర్కార్‌ చిత్రం వారి మధ్య చిచ్చు పెట్టింది. వివరాలోకి వెళ్లితే.. విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్‌. విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద హంగామా సృష్టించారు. చెన్నైలోని రోహిణి థియేటర్‌ వద్ధ సర్కార్‌ చిత్రానికి సంబంధించిన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు విజయ్‌ అభిమానుల భేటీ అయ్యారు. దీనిపై ఇతర హీరోల అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించింది. వారు నటుడు అజిత్‌ అభిమానులను, ఆయన కుటుంబాన్ని కించపరచే విధంగా మాట్లాడారు. అంతే కాకుండా రోహిణి థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన రజనీకాంత్‌ చిత్ర పోస్టర్‌ను చించేశారు. దీంతో విజయ్‌ అభిమానులపై ఇతర నటుల అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement