స్వలింగ సంపర్కం తీర్పుపై రివ్యూ పిటిషన్ | central government files review petition in Supreme court on gay sex verdict | Sakshi
Sakshi News home page

స్వలింగ సంపర్కం తీర్పుపై రివ్యూ పిటిషన్

Published Fri, Dec 20 2013 2:39 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

central government files review petition in Supreme court on gay sex verdict

న్యూఢిల్లీ :  స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది.  స్వలింగ సంపర్కం నేరమేనంటూ ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కానికి పాల్పడితే జీవిత ఖైదు కూడా విధించడానికి వీలుంది.
 

సుప్రీం కోర్టు తీర్పుపై గే సమాజం, హక్కుల సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నాయి. దాంతో స్వలింగ సంపర్కుల పట్ల కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేసింది. దీనిపై ఇప్పటికే న్యాయశాఖ అటార్నీ జనరల్ (ప్రభుత్వానికి న్యాయ వ్యవహరాల్లో మార్గదర్శకుడు) అభిప్రాయాన్ని కోరినట్టు జాతీయ మీడియా చానల్స్ వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement