gay sex
-
LGBTQI: అసహజమేనా!.. స్వలింగ సంపర్కంపై మారుతున్న దృక్కోణం
స్వలింగ సంపర్కం. అసహజ లైంగిక ప్రవృత్తి. ఇది కొత్తదేమీ కాదు. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోలోనూ అనివార్యంగా కన్పించే ధోరణే. కానీ కొన్ని దశాబ్దాల క్రితం దాకా దీనికి సమాజం ఆమోదం లేదు. సరికదా, ఇందుకు పాల్పడే వారిని దోషుల్లా పరిగణిస్తూ హీనంగా చూసే ధోరణే చాలా సమాజాల్లో ఉండేది. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆస్కార్ వైల్డ్‌ను కూడా గే సెక్స్‌కు పాల్పడ్డారంటూ జైల్లో పెట్టారు! అత్యంత ప్రగతిశీల దేశంగా చెప్పుకునే ఇంగ్లండ్‌లో కూడా వందేళ్ల క్రితం ఇదీ పరిస్థితి! ఇప్పటికీ ఐరాస సభ్య దేశాల్లో 76కు పైగా స్వలింగ సంపర్కులపై వివక్షపూరితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయితే గత పాతికేళ్లుగా ఈ విషయంలో పౌర సమాజం దృక్కోణంలో చెప్పుకోదగ్గ మార్పు కన్పిస్తోంది. లైంగిక ప్రవృత్తి విషయంలో స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కు వంటిదేనన్న వాదనలూ బయల్దేరాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ సంబంధాలకు సమర్థన 1990ల్లో 20 శాతం లోపే ఉండగా 2020 నాటికి 70 శాతానికి పైగా పెరిగింది! తాజాగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అధ్యక్షుడు బైడెన్ సంతకం కూడా చేశారు. ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, హక్కుల సంఘాలు కూడా స్వలింగ సంపర్కానికి, ఆ వివాహాలకు కొన్నేళ్లుగా ఎంతగానో మద్దతిస్తున్నాయి. స్వలింగ వివాహాలను తొలిసారిగా 2000లో నెదర్లాండ్స్ చట్టబద్ధం చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా 34 దేశాల్లో చట్టపరంగానో, కోర్టు ఆదేశాల రూపేణో అందుకు ఆమోదం లభించింది. ఐరాస సభ్య దేశాల్లో భారత్‌తో పాటు మొత్తం 71 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి. ఆసియా దేశాల్లో... దక్షిణ, మధ్య ఆసియాతో పాటు ఆఫ్రికాలోని పలు దేశాల్లో స్వలింగ సంపర్కం, వివాహాలపై తీవ్ర వ్యతిరేకత, నిషేధం అమల్లో ఉన్నాయి. ఆసియాలో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా తైవాన్ నిలిచింది. అలాగే చైనా కూడా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదు. అయితే వారి వివాహాన్ని మాత్రం నేరంగానే చూస్తోంది. వియత్నాం కూడా ఇవి నేరం కాదని పేర్కొన్నా ఇంకా పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించలేదు. ఆ దేశాల్లో మరణశిక్షే... సౌదీ అరేబియా, సుడాన్, యెమన్, ఇరాన్‌ల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే! నైజీరియా, సోమాలియాల్లోనూ కొన్ని ప్రావిన్సుల్లో ఇదే పరిస్థితి! అసహజ రతి, వివాహేతర సంబంధాలతో పాటు స్వలింగ సంపర్కులను కూడా రాళ్లతో కొట్టి చంపే శిక్షలు అరబ్ దేశాలతో పాటు పలు ఇరత దేశాల్లో అమల్లో ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల్లోనూ ఇందుకు మరణశిక్ష విధించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రూనై మాత్రం స్వలింగ సంపర్కాలకు మరణశిక్ష అమలు చేయబోమని ప్రకటించడం విశేషం. భారత్‌లో పరిస్థితి? మన దేశంలో ఆది నుంచీ స్వలింగ సంపర్కంపై చిన్నచూపే ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వారి హయాంలో దీనిపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు కూడా ఇది ప్రకృతి విరుద్ధమని, శిక్షార్హమైన నేరమేనని 2013లో తీర్పు చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నాన్ బెయిలబుల్ నేరం. దీనికి పదేళ్ల దాకా జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ఎంతమాత్రమూ నేరం కాదని పేర్కొంటూ 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలు చిలీ, స్విట్జర్లాండ్, కోస్టారికా, ఈక్వెడార్, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, మాల్టా, జర్మనీ, కొలంబియా, అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లండ్, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, స్కాట్లండ్, ఇంగ్లండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఉరుగ్వే, డెన్మార్క్, అర్జెంటీనా, పోర్చుగల్, ఐస్లాండ్, స్వీడన్, మెక్సికో, నార్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, తైవాన్ ఏమిటీ ఎల్జీబీటీక్యూఐ? ► రకరకాల అసహజ లైంగిక ప్రవృత్తులున్న వారందరినీ కలిపి ఎల్జీబీటీక్యూఐ అని వ్యవహరిస్తుంటారు. ► ఇది లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్ సెక్స్‌కు సంక్షిప్త నామం. ► ఇద్దరు మహిళల మధ్య ఉండే లైంగికాసక్తి లెస్బియనిజం. ఇలాంటివారిని లెస్బియన్‌గా పిలుస్తారు. అదే పురుషుల మధ్య ఉంటే వారిని గే అంటారు. ► సందర్భాన్ని బట్టి ఎవరి మీదనైనా ఆకర్షణ చూపేవారు బై సెక్సువల్. ► ఇక పుట్టినప్పుడు ఆడ/మగగా ఉండి, పెరిగి పెద్దయ్యాక అందుకు భిన్నంగా మారేవారిని/మారేందుకు ఆసక్తి చూపేవారిని ట్రాన్స్‌జెండర్/ట్రాన్స్ సెక్సువల్ అంటారు. అంటే తృతీయ ప్రకృతులన్నమాట. మన దగ్గర హిజ్రాలుగా పిలిచేది వీరినే. దేశవ్యాప్తంగా వీరికి రకరకాల పేర్లున్నాయి. మళ్లీ వీరిలో చాలా రకాల వారుంటారు. ఉదాహరణకు మగ పిల్లాడిగా పుట్టి కూడా తనను తాను అమ్మాయిగా భావించుకుంటూ మరో అబ్బాయిని ఇష్టపడేవాళ్లు ఈ కోవలోకే వస్తారు. ఇలాంటివారిని హెటిరో సెక్సువల్ ట్రాన్స్‌జెండర్ అంటారు. ► క్యూ అంటే క్వీర్. వీరికి తాము ఆడా, మగా, ట్రాన్స్‌జెండరా, మరోటా అన్నదానిపై వాళ్లకే స్పష్టత ఉండదు. అందుకే వీరిని క్వశ్చనింగ్ అని కూడా అంటూంటారు. ► చివరగా ఇంటర్‌సెక్స్. అంటే పుట్టినప్పుడు జననాంగాల స్థితిగతులను బట్టి ఆడో, మగో చెప్పలేనివారు. మళ్లీ వీరిలోనే క్రాస్డ్రెస్సర్స్ అనీ, మరోటనీ పలు రకాలున్నాయి. ► ఎల్జీబీటీక్యూఐ మొత్తాన్నీ కలిపి ఇటీవల కామన్‌గా గే గా వ్యవహరిస్తున్నారు. ► వీరు తమ ఆకాంక్షలకు ప్రతీకగా తరచూ ఆరు రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ జెండా ఒకరకంగా ఎల్జీబీటీక్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రతీకగా మారిపోయింది. అమెరికాలో స్వలింగ వివాహాలు ఇక చట్టబద్ధం బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం మధ్యాహ్నం వేలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. స్వలింగ వివాహాలకు వీలు కల్పించే బిల్లు చట్టరూపం దాల్చడమే వారి ఆనందానికి కారణం. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్ మ్యారేజెస్) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు ఇది చాలా ప్రాధాన్యం అంశమని అన్నారు. బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేసే కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పోరాటం చేసిన వారికి ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇకపై అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయడమే..!
బందర్ సెరి బేగవాన్(బ్రూనై) : ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. షరియా చట్టాల ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇటువంటి శిక్షలు వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అదే విధంగా దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్ష వచ్చే బుధవారం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటిసారి దొంగతనానికి పాల్పడితే కుడిచేతిని, రెండోసారి కూడా అదే తప్పు పునరావృతం చేస్తే ఎడమ పాదాన్ని నరికివేస్తారు. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు. కాగా ప్రభుత్వ నిర్ణయం హక్కులను ఉల్లంఘించేలా ఉందని మానవ హక్కుల సంస్థలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విఙ్ఞప్తి చేసింది. ఇక ఈ విషయం గురించి హ్యూమన్ రైట్స్ వాచ్ సభ్యులు ఫిల్ రాబర్ట్సన్ మాట్లాడుతూ..‘ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి బ్రూనేను బహిష్కరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆగ్నేయ ఆసియా దేశంలో ఇటువంటి శిక్షలు అమలు చేసే తొలి దేశంగా గుర్తింపు పొందడం ద్వారా వివాదాస్పద దేశంగా బ్రూనై ముద్రపడుతుంది. తద్వారా విదేశీ పెట్టుబడులు, పర్యాటకుల సంఖ్య తగ్గి భారీగా ఆదాయం నష్టపోవాల్సి ఉంటుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తమ విధానం గురించి బ్రూనై మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ 2013 నుంచి అనైతిక చర్యలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేసే విషయమై.....లోతుగా చర్చించాం. ప్రస్తుతం వీటిని అమల్లోకి తేవాలని భావిస్తున్నాం. ఈ విషయం గురించి మా మంత్రి సుల్తాన్ హసనాల్ బోల్కా ఏప్రిల్ 3న అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది’అని తెలిపారు. -
‘స్వలింగ సంపర్కం’ నేరమా? కాదా?
న్యూఢిల్లీ : భారతదేశంలో స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అనే విషయంపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పు చెప్పనుంది. స్వలింగ సంపర్కంపై భారత్‌లో బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి నిషేధం ఉంది. బ్రిటిష్ వారు 1861లో రూపొందించిన క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(సీఆర్పీసీ) సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు. అయితే, 2013లో స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ సందర్భంగా కొత్త చట్టాలు రూపొందించడం పార్లమెంటు పని అని పేర్కొంది. అప్పటివరకూ స్వలింగ సంపర్కం నేరమేనంటూ తీర్పునిచ్చింది. 2013లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని భావిస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ సోమవారం పేర్కొంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ.. ప్రకృతికి విరుద్ధంగా సంపర్కం జరపడాన్ని నేరంగా పరిగణిస్తున్న సీఆర్పీసీలోని సెక్షన్ 377ను సమీక్షించాలని విస్తృత ధర్మాసనంలోని జడ్జిలను కోరింది. కేవలం లింగ పరమైన కారణాలతో ఓ వ్యక్తి తన జీవితాన్ని భయంతో గడపాలా? అనే ప్రశ్నను బెంచ్ లేవనెత్తింది. ‘ఒకరికి సహజంగా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చ’ని ఈ సందర్భంగా ముగ్గురు జడ్జిల బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం పట్ల ధోరణి మారుతుండటంతో గే సెక్స్‌ను నేరంగా పరిగణించాలని ప్రభుత్వం కూడా భావించడం లేదని సమాచారం. -
గే సెక్స్ వల్లే భూకంపాలు!
ఘనా దేశంలో హోమోసెక్సువల్స్ మీద పెరుగుతున్న దాడులను ముస్లిం మత పెద్ద ఒకరు సమర్థించారు. అసలు గే సెక్స్ అనేది అల్లాను అవమానిస్తుందని, దానివల్లే భూకంపాలు వస్తున్నాయని ఆయన అన్నారు. కుమాసి నగరంతో పాటు రాజధాని అక్రాలో స్వలింగ సంపర్కుల మీద జోంగో వర్గానికి చెందినవాళ్లు దాడులు చేస్తున్నట్లు కథనాలు రావడంతో ముస్లిం మత గురువు అయిన మల్లమ్ అబ్బాస్ మహ్మూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు మగవాళ్ల మధ్య లైంగిక సంబంధం ఉంటే అల్లా చాలా చిరాకు పడతారని, దానివల్లే భూకంపాలు వస్తాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తమ మీద దాడులు జరుగుతాయన్న ఆందోళనతో పలువురు గే పురుషులు ఇళ్లు వదిలిపెట్టి పారిపోయారు. సొడోమ్, గొమొర్రా నగరాల్లో స్వలింగ సంపర్కం ఎక్కువ కావడం వల్లే అల్లా ఆ రెండు పురాతన నగరాలను నాశనం చేశారని మహ్మూద్ చెప్పారు. పవిత్ర ప్రబోధాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ తరహా చర్యలను మన వర్గాల్లో అనుమతించాలా అని ప్రశ్నించారు. అలాంటి ఇడియట్లను జోంగో వర్గం నుంచి తరిమేయడం తమకు చాలా సంతోషమని కూడా చెప్పారు. ఘనా దేశంలో హోమోసెక్సువాలిటీ నేరం. -
స్వలింగ సంపర్కుల్లో చిగురించిన కొత్త ఆశలు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు అంగీకరించింది. దీనిని వచ్చేవారం చేపట్టే విచారణల జాబితాలో చేర్చాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గే సెక్స్ నేరమంటూ ఇచ్చిన తీర్పును కోర్టు సవరించుకోవచ్చని భావిస్తున్న ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. గే సెక్స్ నేరమని, అందుకు జీవిత ఖైదు వరకూ శిక్ష విధించవచ్చని పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377(అసహజ శృంగార నేరాలు) చట్టబద్ధతను సమర్థిస్తూ గత ఏడాది డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నాజ్ ఫౌండేషన్, ప్రముఖ సినీ దర్శకుడు శ్యాం బెనెగల్, గే హక్కుల కార్యకర్తలు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారించాలంటూ పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కోరగా వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆమోదించింది. కోర్టు తీర్పులపై అప్పీళ్లలో క్యూరేటివ్ పిటిషన్ వేయడం అనేది న్యాయపరంగా ఆఖరి ప్రక్రియ. సాధారణంగా క్యూరేటివ్ పిటిషన్లపై ఎలాంటి వాదనలకూ అవకాశం ఇవ్వకుండా న్యాయమూర్తులు ఇన్-చాంబర్ కోర్టులోనే పిటిషన్లను విచారిస్తారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా బహిరంగ కోర్టులో విచారించేందుకు అంగీకరిస్తారు. -
‘స్వలింగ సంపర్కం’పై ఓపెన్ కోర్టు విచారణకు సుప్రీం ఓకే!
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకూ శిక్ష విధించవచ్చంటూ సుప్రీంకోర్టు గతేడాది డిసెంబరు 11న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను గురువారం సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారించాలంటూ పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కోరగా.. వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. -
గే హక్కులను కాపాడండి మహాప్రభో!
బీజింగ్: ప్రజల హక్కులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ఒకవేళ ప్రజా హక్కులకు ఏమైనా భంగం వాటిల్లితే వాటి పరిష్కారానికి ప్రత్యేక సంఘాలున్నాయి. కానీ స్వలింగ సంపర్కులకు ఇక్కడ భిన్నంగానే జరుగుతుంది. వారి హక్కులను కాపాడటానికి ఏ దేశంలోనూ చట్ట ప్రకారం నడిచే ప్రత్యేక సంస్థలు లేవు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సిందేనంటూ చైనా జాతీయుడు ఆ దేశంపై పోరాటం చేస్తున్నాడు. జియాంగ్ జిహాన్ (ఇది అతని అసలు పేరు కాదు) అనే వ్యక్తి గే హక్కులను కాపాడాలంటూ హెచ్ డీసీఏను సంప్రదించాడు. ఇదే అంశంపై గత సంవత్సరంలో ఆ వ్యక్తి అనేకసార్లు తన అభ్యర్థనను విన్నవించాడు. గే సెక్స్ అనేది సమాజానికి ఆమోదయోగ్యం కాని చర్య అవడం వల్ల వారికి ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హెచ్ డీసీఏ తెలిపింది. దీంతో చేసేది లేక తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. తాము కూడా సమాజంలో భాగమైనందున, తమ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఆ దేశంలో గేలపై ఎటువంటి నిషేధం లేదు కనుక కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
స్వలింగ సంపర్కం నేరమే:సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోమారు తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను మంగళవారం విచారించిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. గే సెక్స్ నేరమేనన్న తీర్పుపై తిరిగి సమీక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించబోమని పేర్కొంది. గతంలో స్వలింగ సంపర్కంపై ఇచ్చిన తీర్పును జస్టిస్ దత్తు, జస్టిస్ ఎస్.జే.ముఖోపాధ్యాయతో కూడిన ధర్మాసనం సమర్ధించింది. స్వలింగ సంపర్కం నేరమంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను సమర్థిస్తూ వెలువరించిన తీర్పు వల్ల వేలాదిమంది స్వలింగ సంపర్కులు ప్రాసిక్యూషన్ రిస్క్‌తోపాటు వేధింపులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ తీర్పును పునఃపరిశీలించాలని కోరింది. -
ఉన్నతస్థానాల్లో ఉండి అలా మాట్లాడతారా?
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ వెలువరించిన తీర్పుపై కొందరు కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. వారి వ్యాఖ్యలు సమర్థనీయం కావని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. స్వలింగ సంపర్కంపై సుప్రీం తీర్పును తప్పుపట్టే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్)పై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌తోపాటు పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘ఉన్నతమైన స్థానాల్లో ఉండి వారు ఇలా మాట్లాడడం సమర్థనీయం కాదు. వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. మున్ముందు ఇలా మాట్లాడేముందు జాగ్రత్తగా ఉండాలి’’ అని బెంచ్ పేర్కొంది. చిదంబరం మాటలు అంత అభ్యంతరకరంగా లేకపోయినా మిగ తా మంత్రుల వ్యాఖ్యలు సరికాదంది. అయితే వారిపై చర్యలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
ఆ తీర్పును పునఃపరిశీలించండి
-
ఆ తీర్పును పునఃపరిశీలించండి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) లోని సెక్షన్ 377ను సమర్థిస్తూ వెలువరించిన తీర్పు వల్ల వేలాదిమంది స్వలింగ సంపర్కులు ప్రాసిక్యూషన్ రిస్క్‌తోపాటు వేధింపులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ తీర్పును పునఃపరిశీలించాలని కోరింది. స్వలింగ సంపర్కులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశామని పేర్కొంది. సాధారణంగా రివ్యూ పిటిషన్లపై చాంబర్లోనే వాదనలు విని, దానిపై నిర్ణయం తీసుకుంటారు. అయితే తమ పిటిషన్‌పై కోర్టులోనే వాదనలు వినాలని అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి కోరారు. పరస్పర సమ్మతితో ఏకాంతంలో ఇద్దరు వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈనెల 11న కొట్టివేసిన సంగతి తెలిసిందే. అసహజమైన శృంగార చర్యలు, స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకు శిక్ష విధించవచ్చని చెబుతున్న సెక్షన్ 377ను సమర్థిస్తూ అప్పుడు ఉత్తర్వులు వెలువరించింది. దీనిపై స్వలింగ సంపర్కుల నుంచే కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా పలువురు నేతల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. న్యాయసూత్రాలకు విరుద్ధం: ప్రాథమిక హక్కులపై సుప్రీం ఇప్పటికే స్పష్టంగా జారీచేసిన పలు న్యాయసూత్రాలకు ఈ తీర్పు విరుద్ధంగా ఉందని కేంద్రం తన పిటిషన్లో పేర్కొంది. అందుకు సంబంధించిన 76 ఆధారాలను పొందుపరిచింది. ఈ కేసులో వెలువరించిన తీర్పులో న్యాయ తప్పిదాలు ఉన్నాయని వివరించింది. స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చాలామంది స్వలింగ సంపర్కులు తమ అలవాటు గురించి కుటుంబాలు, పని ప్రదేశాలు, విద్యాసంస్థలు తదితర చోట్ల వెల్లడించారని తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీం తాజా తీర్పుతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారని, వారికి తక్షణమే ఉపశమన చర్యలు అవసరమని నివేదించింది. ‘‘ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయడంపై పార్లమెంటుదే నిర్ణయాధికారం అని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవానికి సెక్షన్ 377తో సహా ఐపీసీని 1860లో ఆంగ్లేయులతో కూడిన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. అందువల్ల సెక్షన్ 377 భారత పార్లమెంటు ఆమోదంతోనే రూపొందిందని చెప్పలేం’’ అని కేంద్రం తన పిటిషన్లో వివరించింది. అంతేకాకుండా ప్రపంచంలో చాలా దేశాలు స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేశాయని వెల్లడించింది. మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదు: జైట్లీ స్వలింగ సంపర్కం నేరమని పేర్కొంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని బీజేపీ పేర్కొంది. దీనిపై ఇంకా చర్చ ముగియలేదని అభిప్రాయపడింది. ‘‘ఈ అంశంపై చర్చ ముగిసిందని నేను భావించడంలేదు. ఆ సెక్షన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సెక్షన్ పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి, ఏ అంశాలు రావు అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అందువ ల్ల ప్రభుత్వం ఆ అనిశ్చితిని తొలగించాలి’’ అని రాజ్యసభలో విపక్షనేత అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ ఫిక్కీ మహిళా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుప్రీం తీర్పును బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమర్థించిన విషయాన్ని ప్రస్తావించగా.. కేంద్రం నిర్ణయాన్ని చూసిన తర్వాతే తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సుష్మాస్వరాజ్ స్పష్టంచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
స్వలింగ సంపర్కం తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. స్వలింగ సంపర్కం నేరమేనంటూ ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కానికి పాల్పడితే జీవిత ఖైదు కూడా విధించడానికి వీలుంది. సుప్రీం కోర్టు తీర్పుపై గే సమాజం, హక్కుల సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నాయి. దాంతో స్వలింగ సంపర్కుల పట్ల కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేసింది. దీనిపై ఇప్పటికే న్యాయశాఖ అటార్నీ జనరల్ (ప్రభుత్వానికి న్యాయ వ్యవహరాల్లో మార్గదర్శకుడు) అభిప్రాయాన్ని కోరినట్టు జాతీయ మీడియా చానల్స్ వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. -
మేం నేరస్తులం కాదు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఎల్జీబీటీ (స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్నవారు) కార్యకర్తలు, సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరారు. ‘మేం నేరస్తులం కాదు’, ‘మరొక వ్యక్తిని ప్రేమించడమనేది నేరం కాదు’ తదితర ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని జంతర్ మంతర్‌లో ఆందోళన చేశారు. స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీం తీర్పుని మళ్లీ ఒకసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సొసైటీ ఫర్ పీపుల్స్ అవేర్నెస్, కేర్ అండ్ ఎంపవర్మెంట్ (స్పేస్)అనే సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అంజన్ జోషి అన్నారు. ఇతర వర్గాల ప్రజల నుంచి మాకు భారీ మద్దతు లభిస్తోందని, దీన్ని ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకోవాలని జోషి విలేకరులకు తెలిపారు. స్వలింగ సంపర్కంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వారంపాటు ఆందోళనకు దిగనున్నామని హెచ్చరించారు. ‘ఒక పిల్లర్‌ను ఏర్పాటుచేసి మాకు మద్దతిచ్చే వారి సంతకాలను దానిపై తీసుకుంటాం. అన్ని ప్రాంతాలకు ఈ పిల్లర్‌ను తీసుకెళ్లి అందరి మద్దతు కూడగడతాం. ఆ తర్వాత దాన్ని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌కు బహూకరిస్తామ’ని జోషి వెల్లడించారు. స్వలింగ సంపర్కంపై నిషేధాన్ని 2009లో సడలించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు అది ముమ్మాటికీ నేరమేనని ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
మేం నేరస్తులం కాదు: స్వలింగ సంపర్కుల ఆందోళన
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఎల్జీబీటీ (స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, లింగమార్పిడి చెయ్యించుకున్నవారు) కార్యకర్తలు, సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా తమకు అండగా నిలవాలని వారు కోరారు.‘మేం నేరస్తులం కాదు, అవతలి వ్యక్తిని ప్రేమించు హక్కు మా క్కూడా ఉంందని స్వలింగ సంపర్కులు తెలిపారు.తదితర ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని ఆందోళన చేశారు. స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీం తీర్పుని మళ్లీ ఒకసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సొసైటీ ఫర్ పీపుల్స్ అవేర్నెస్, కేర్ అండ్ ఎంపవర్మెంట్ (స్పేస్)అనే సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అంజన్ జోషి అన్నారు. ఇతర వర్గాల ప్రజల నుంచి మాకు భారీ మద్దతు లభిస్తోందని, దీన్ని ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకోవాలని జోషి విలేకరులకు తెలిపారు. స్వలింగ సంపర్కంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వారంపాటు ఆందోళనకు దిగనున్నామని హెచ్చరించారు. -
తెల్లోడి చట్టానికి మన్ననా?
బైలైన్ ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు హెన్రీ గ్లాఫోర్న్ గురించి ఎన్న డూ విని ఉండనందుకు మిమ్మ ల్ని తప్పు పట్టేవారు ఎవరూ లేరు. మూడున్నర శతాబ్దాల క్రితం జీవించిన ఆ నాటక కర్త షేక్స్పియరేమీ కాడు కదా. అయితే ఆయన రాసిన ‘హాస్యం పై ప్రతీకారం’ నాటకంలోని ‘చట్టం బుద్ధి లేని గాడిద’ అనే ఒక్క వాక్యం మాత్రం అజరామరంగా నిలిచిపోదగినది. అదే అభిప్రాయం... మరింత కచ్చితంగా చెప్పాలంటే చట్టం ఒక్కో సందర్భంలో మూర్ఖంగా ఉండగలదనే అభిప్రాయం కాలక్రమంలో పునరవృతమయ్యే పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. కాబట్టి నేటి న్యాయమూర్తులు ప్రత్యేకించి అత్యున్నత న్యాయస్థానాన్ని అధిష్టించి ఉన్నవారు చెడ్డ చట్టం కంటే ఉన్నత స్థానంలో నిలుస్తారని, అందులో కుళ్లి కంపుకొడుతున్న దాన్ని సరిచేసి ఉత్తమమైనదాన్నంతా పరిరక్షిస్తారని ఎవరైనా భావిస్తారు. కానీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా చేసే భారత శిక్షాసృతిలోని 377వ ఆర్టికల్‌పై ప్రస్తావనా మాత్రంగా చేసిన వ్యాఖ్యతో మన సుప్రీం కోర్టు ప్రగతి పథాన్ని తిరస్కరించి తిరోగమించాలని నిర్ణయించుకుంది. అది బ్రిటన్ వలస పాలకులు 1861లో మనపై రుద్దిన చట్టం. వాళ్లు వెళ్లిపోయి చాలా కాలమైన తర్వాత కూడా నిలిచి ఉంది. కపటత్వం ఇంగ్లీషువారి జబ్బేమీ కాదు. అది చెల్లుబాటులో ఉన్న వైఖరుల లక్షణం మాత్రమే. అవి ఎలా ఉత్థాన పతనాలను చూస్తూ ఉంటాయనేది మరో కథ. కానీ నైతికతలో ఇలాంటి సంక్రమణాలు ఉండనైతే ఉన్నాయి. 19వ శతాబ్దపు విక్టోరియా శకంలో సామాజిక దురలవాట్లను సహించేవారు కారు. ప్రత్యేకించి బ్రిటిషువాళ్లు అసలే సహించేవారు కారు. స్వలింగ సంపర్కం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న ఆ సమాజంలోనే దానికి సమాంతరంగా అదే అలవాటు పెంపొందుతుండటం కనబడుతుం ది. నిజానికి ఈ సమాంతర వృద్ధి పర్యవసానమే ఆ అసహనమేమోనని ఆశ్యర్యం కలుగుతుంది. ఆనాటి బాలుర బోర్డింగ్ స్కూళ్లలో స్వలింగ సంపర్కం విస్తృతంగా సాగేది. అది పరస్పర అంగీకారంతో జరిగేది మాత్రమే కాదు కూడా. ఆ స్కూళ్లల్లో చదువుకున్న ఇంగ్లిషు ఉన్నత వ ర్గాల్లో అది విస్తృతంగా వ్యాప్తి చెందింది. అయితే విక్టోరియన్ నైతికత ఎంత ప్రబలమైనదంటే గత దశాబ్ది వరకు అదే స్వలింగసంపర్కంపై బ్రిటిష్ చట్టాన్ని శాసిస్తూ వచ్చింది. పందొమ్మిదవ శతాబ్దిలోనే బ్రిటిష్ సామ్రాజ్యం బ్రహ్మాండంగా వృద్ధి చెందింది. వలసల నూతన యజమానులుగా వారు ఆ సామాజిక చట్టాలనే అక్కడ కూడా విస్తరింపజేశారు. బ్రిటన్ సామ్రాజ్యానికే తలమానికమైన భారత్ ఆ పరోపకారుల దృష్టిలో పడకుండా పోలేదు. మన దేశంలో బ్రిటిష్రాజ్ను స్థాపించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతీయ జీవితంలోకి జోక్యం చేసుకోవడంలో తమకున్న పరిమితి తగు మాత్రం తెలుసు. కంపెనీ గవర్నర్ జనరళ్లలో కొందరు హిందూ, ముస్లిం సామాజిక చట్టాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నించారు. అయితే కం పెనీ అందుకు భారీ మూల్యాలనే చెల్లించాల్సి వచ్చింది. 1857 తిరుగుబాటు అది చెల్లించుకున్న మూల్యాల్లో తక్కువ ప్రాముఖ్యం గలదేమీ కాదు. 1857లో కంపెనీ పగ్గాలు కోల్పోయాక భారత్ ప్రత్యక్షంగా బ్రిటన్ సింహాసనం పాలన కిందకు వచ్చింది. లండన్ లోనినైతికవాదులు తమ కంటే అతిసూక్ష్మ నైతిక వివేచన గలిగిన నాగరికతలపై తమ దృష్టికి ఏది మంచి, ఏది చెడు అయితే వాటినే రుద్దడానికి పూనుకున్నారు. బ్రిటన్ సింహాసనాధిపత్యం కిందకు వచ్చిన మూడేళ్లకే బ్రిటిష్ ఇండియా ఆ స్మృతిని స్వీకరించింది. యూదు, క్రైస్తవ, ఇస్లాం మత చట్టాల్లో స్వలింగ సంపర్కంపై తీవ్ర విమర్శలున్నాయని సూచించే కొన్ని వ్యాఖ్యానాలు ఇటీవల వెలువడుతున్నాయి. అందుకు భిన్నంగా హిందూ మతం స్వలింగ సంపర్కాన్ని మత విశ్వాస వ్యవస్థలో భాగంగానే అంగీకరించింది. మొఘల్ చక్రవర్తులు కూడా అంతే సానుకూల దృక్పథంతో వ్యవహరించారు. అయినా వాళ్లు అంగీకరించకుండా ఎలా ఉంటారు? మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ ఒక యువకునిపై ఆయనకున్న ప్రేమను అద్భుతమైన వర్ణనలతో డైరీలో రాసి పెట్టాడాయె. సాధారణ భారతీయుల వైఖరిలాగే మొఘలుల వైఖరి కూడా ఆచరణాత్మకమైనది. ఈ అంశంపై అత్యుత్తమమైన అవగాహన ను అందించినది బహుశా ఫ్రాయిడ్ వివరణే కావచ్చు. అదే కావడం అనివార్యం కూడా కావచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1935లో రాసిన ఒక లేఖలో ‘స్వలింగ సంపర్కం ఒక సానుకూలత కాదు, దుర్వ్యసనంగానీ లేదా రుగ్మత గానీ కాదు. దాని గురించి సిగ్గుపడాల్సింది ఏమీలేదు. స్వలింగ సంపర్కాన్ని శిక్షించడం మహా అన్యాయం, క్రూరత్వం’ అన్నాడు. విషాదకరంగా మన సుప్రీంకోర్టు ఆ అన్యాయానికి సాధికారతను కల్పించి తన విశ్వసనీయతను పోగొట్టుకుంది. ఢిల్లీ హైకోర్టు ఏడాది క్రితమే పాత తప్పును సరిదిద్దే చారిత్రక అవకాశాన్ని సృష్టించింది. సుప్రీంకోర్టు రాబోయే 150 ఏళ్లకు కొలబద్ధను నెలకొల్పడానికి బదులు గత 150 ఏళ్ల సందేహాస్పద తర్కానికి పాల్పడింది. అలాంటి మార్పును తేవాల్సిన బాధ్యత శాసన విభాగానిదేనంటూ తన వాదానికి ఆధారాన్ని చూపింది. అయితే అది సమర్థన మాత్రమే. ఢిల్లీ హైకోర్టు కూడా ఇలాగే నిర్ణ యం తన పరిధికి వెలుపలిది అనుకోలేదు. సుప్రీం కోర్టుకు తదుపరి తరం న్యాయమూర్తులను అందించే కోర్టుల్లో అది కూడా ఒకటి. మన దేశంలో స్వేచ్ఛ బేరసారాలకు అతీతమైన ప్రాథమిక హక్కు. తమతో ఏకీభవించే వారికి మాత్రమే స్వేచ్ఛను వర్తింపజేసేట్టయితే అలాంటి స్వేచ్ఛ అర్థరహితమైనది. ఇతరులకు కూడా చోటును కల్పిస్తేనే చట్టం మానవ హక్కుల పరిరక్షణ కర్త అవుతుంది. సుప్రీంకోర్టు తీర్పులోని కొన్ని వాదనలు ‘విలువైనవి’. దేశంలో నూటికి ఒక్కరు స్వలింగ సంపర్కులే ఉంటే అదేమంత పట్టించుకోవల్సింది కాదనేది అందులో ఒకటి. అయితే ఆ ఒక్కరికి కూడా... వారు ఇతరుల హక్కుల దురాక్రమణకో లేక అణచివేతకో పాల్పడనంత కాలం అన్ని హక్కులు ఉంటాయి. స్వలింగ సంపర్కం భిన్నలింగ సంపర్కుల హక్కులకు భంగం కలిగించేదేమీ కాదు. అలాంటప్పుడు అది చట్టవిరుద్ధం ఎందుకవుతుంది? భారత శిక్షాస్మృతిలోని ఆ సెక్షన్ కింద నమోదైన కేసులు చాలా అరుదనే దాని వాదన కూడా సరైనది కాదు. ఒక్క వ్యక్తే అయినాగానీ ఎందుకు నేరారోపణకు గురికావాలి? ఇలాంటి హక్కులకు సంబంధించి ‘పాశ్చాత్యమైనది’ లేదా ‘ప్రాచ్యమైనది’ ఏదీ లేదు. శివ, కేశవులకు పుట్టిన శబరిమల స్వామి అయ్యప్ప అట్లాంటిక్ తీరంలో ప్రత్యక్షమైనవాడేం కాదు. ఈ తప్పును సరిదిద్దుకోడానికి ఇప్పటికే బాగా ఆల స్యం అయిపోయిందా? న్యాయస్థానంలో ఉండేది మానవ మాత్రులే గానీ దేవతలు కాదు. తప్పు చేయడం మానవ నైజం. గొప్ప స్వేచ్ఛా సిద్ధాంతకర్త అయిన రోబిస్పియర్ చెప్పిన ఈ మాటలు తోవను చూపిస్తాయేమో ‘‘అనుల్లంఘనీయమైన మానవ హక్కులకు విఘాతం కలిగించే ఏ చట్టమైనా ఆవశ్యకంగానే అన్యాయమైనది, నిరంకుశమైనది. అదసలు చట్టం కానే కాదు.’’ -
స్వలింగ సంపర్కంపై ఆర్డినెన్స్ ఉండదు:షిండే
బెంగళూరు: స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును నిలువరించడానికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టంచేశారు. శనివారం బెంగళూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. సుప్రీం ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్‌ను తీసుకు రాదలచుకోలేదని చెప్పారు. స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడం నిరాశ కలిగించిందని, ఇక ఈ అంశాన్ని పార్లమెంటు పరిష్కరిస్తుందని సోనియా.. స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని, ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనే తాను ఏకీభవిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని, దాన్ని సరి చేయించడానికి అవసరమైన అన్ని మార్గాలనూ పరిశీలిస్తామని చెప్పింది. ఇందుకోసం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని, రివ్యూ లేదా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని భావించింది. అయితే షిండే ప్రస్తుతానికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే ఆలోచన ఏది ప్రస్తుతానికి లేదని తేల్చిచెప్పారు. అంతకు ముందు యలహంకలో జాతీయ గూఢచర్య గ్రిడ్ విపత్తు పునశ్చేతన కేంద్రానికి (నాట్‌గ్రిడ్) షిండే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశంలో ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడంలో నాట్‌గ్రిడ్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు. గూఢచర్య, భద్రతా సిబ్బంది అవిశ్రాంతంగా సేవలందిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదుల బెదిరింపులను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. ఇలాంటి సమయాల్లో టెక్నాలజీ కొరత ప్రతిబంధకంగా మారుతోందన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి నాట్‌గ్రిడ్ ఎంతో సహాయకారి కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో ముందున్న బెంగళూరు నగరం నాట్‌గ్రిడ్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమని ఆయన చెప్పారు. -
‘గే’ అథ్లెట్లకు మద్దతివ్వండి: మార్టినా నవ్రతిలోవా
యునెటైడ్ నేషన్స్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లాంటి ప్రపంచ స్పోర్ట్స్ బాడీలు... స్వలింగ సంపర్క అథ్లెట్లకు మరింత మద్దతు ఇవ్వాలని అమెరికా టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా, ఎన్బీఏ ప్లేయర్ జాసన్ కొలిన్స్ కోరారు. ఈ అంశంలో ఐఓసీ మరింత స్వేచ్ఛగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నవ్రతిలోవా వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కులపై జరుగుతున్న హింస, వివక్షపై ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ఈ ఇద్దరు ప్లేయర్లు మద్దతుగా నిలిచారు. ‘ఇది ఒక్క దేశానికే పరిమితం కాలేదు. అన్ని దేశాల్లో ఇది కొనసాగుతోంది. అయినా దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. 2022 ఫిఫా వరల్డ్‌కప్ ఖతార్‌లో జరగనుంది. అక్కడి నిబంధనల ప్రకారం స్వలింగసంపర్క చర్యకు జైలు శిక్ష వేస్తారు’ అని నవ్రతిలోవా ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఒలింపిక్స్, సోచీలో జరగనున్న పారాలింపిక్స్‌లో స్వలింగ సంపర్కుల పట్ల కొంత మంది అధికారులు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. అయితే దీనిపై స్పందించిన కొలిన్స్ మాట్లాడుతూ... ‘స్థానికంగా ఉండే స్వలింగ సంపర్కులు, లెస్బియన్స్, లింగమార్పిడి వ్యక్తులపై దృష్టిపెడితే బాగుంటుంది. కానీ క్రీడలు ఆడేందుకు వచ్చే వారిపై ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కొలిన్స్ వివరించారు. -
స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు
-
స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టేసింది. ఈ మేరకు వివిధ సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు దాఖలు చేసిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఆమోదించింది. గే సెక్స్ చట్టవిరుద్ధమని, అది నేరమని, జీవితఖైదు వరకు విధించగలిగేంత శిక్షార్హమని చెప్పే ఐపీసీ సెక్షన్ 377లో రాజ్యాంగపరంగా ఎలాంటి సమస్యా లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ సెక్షన్‌ను ఐపీసీ నుంచి తొలగించాలా లేదా అనే విషయాన్ని శాసన వ్యవస్థ చూసుకోవాలని తెలిపింది. స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలకు ఇది శరాఘాతంలాగే పరిణమిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఇద్దరి అంగీకారంతో జరిగే హోమోసెక్సువాలిటీ నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును కొట్టేసింది. స్వలింగ సంపర్కం అనేది మన దేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలకు విరుద్ధమని వివిధ సంస్థలు కోర్టులో వాదించాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టేసినా, ఈ వివాదాస్పద అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం పార్లమెంటేనంటూ బంతిని శాసనవ్యవస్థ కోర్టులోకి నెట్టేసింది.