మేం నేరస్తులం కాదు: స్వలింగ సంపర్కుల ఆందోళన | LGBT community protest in Delhi | Sakshi
Sakshi News home page

మేం నేరస్తులం కాదు:స్వలింగ సంపర్కుల ఆందోళన

Published Sun, Dec 15 2013 8:41 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

మేం నేరస్తులం కాదు: స్వలింగ సంపర్కుల ఆందోళన - Sakshi

మేం నేరస్తులం కాదు: స్వలింగ సంపర్కుల ఆందోళన

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఎల్‌జీబీటీ (స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, లింగమార్పిడి చెయ్యించుకున్నవారు) కార్యకర్తలు, సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా తమకు అండగా నిలవాలని వారు కోరారు.‘మేం నేరస్తులం కాదు, అవతలి వ్యక్తిని ప్రేమించు హక్కు మా క్కూడా ఉంందని స్వలింగ సంపర్కులు తెలిపారు.తదితర ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని ఆందోళన చేశారు. స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీం తీర్పుని మళ్లీ ఒకసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. 

 

వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సొసైటీ ఫర్ పీపుల్స్ అవేర్‌నెస్, కేర్ అండ్ ఎంపవర్‌మెంట్ (స్పేస్)అనే సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అంజన్ జోషి అన్నారు. ఇతర వర్గాల ప్రజల నుంచి మాకు భారీ మద్దతు లభిస్తోందని, దీన్ని ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకోవాలని జోషి విలేకరులకు తెలిపారు. స్వలింగ సంపర్కంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వారంపాటు ఆందోళనకు దిగనున్నామని హెచ్చరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement