న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకూ శిక్ష విధించవచ్చంటూ సుప్రీంకోర్టు గతేడాది డిసెంబరు 11న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను గురువారం సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారించాలంటూ పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కోరగా.. వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.