సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల నెలవారీ పెన్షన్‌ను పెంచాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న పెన్షన్‌ను రూ. 20 వేలకు పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే వారి వైద్య, రవాణా సదుపాయాలు పెంచేందుకూ నిర్ణయించారు. ఇందుకోసం బుధవారం రాత్రంతా సచివాలయంలోనే ఉండి బిల్లును రూపొందించారు. గురువారం ఉదయమే సీఎం సంతకం కూడా చేయిం చుకున్నారు. అయితే ముందుగా ఈ బిల్లు గురించి స్పీకర్‌కు తెలియచేయకుండా హడావుడిగా సభలో పెట్టేం దుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందుకు స్పీకర్ నో చెప్పారు. కాగా, అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడటంతో ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ పెంపు బిల్లుకు స్పీకర్ నో
Published Fri, Feb 14 2014 1:20 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
Advertisement