
విజయ్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సర్కార్’ తమిళ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ ఉంది. అభిమానులను అలరించే అన్ని అంశాలను ఇందులో మేళవించినట్టుగా కనబడుతోంది. విజయ్ తనదైన శైలిలో డైలాగులు, డాన్సులు, ఫైట్స్ తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్పొరేట్ క్రిమినల్ పాత్రలో విజయ్ కనిపించనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, రాధా రవి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment