విజయ్‌ ‘సర్కార్‌’ ఫస్ట్‌ లుక్‌! | Vijay AR Murugadoss New Movie Sarkar First Look Out | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 6:20 PM | Last Updated on Thu, Jun 21 2018 6:33 PM

Vijay AR Murugadoss New Movie Sarkar First Look Out - Sakshi

ఇళయ దళపతిగా తమిళనాట తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తరువాత అంతటి ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ మాస్‌ హీరోగా కెరీర్‌లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. తుపాకీ, కత్తి లాంటి బ్లాక్‌ బస్టర్‌ విజయాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. తాజాగా వీరిద్దరు మరో సినిమాతో హ్యాట్రిక్‌ హిట్‌ను అందుకునేందుకు రెడీ అవుతున్నారు. 

విజయ్‌ పుట్టినరోజు(జూన్‌ 22) కానుకగా గురువారం(జూన్‌ 21) సాయంత్రం ఈ సినిమా టైటిల్‌ను, విజయ్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. కళ్ల జోడుతో, సిగరెట్‌ తాగుతూ మాస్‌లుక్‌లో ఉన్న విజయ్‌.. తన అభిమానులకు అదిరిపోయే కానుకను ఇచ్చారు. ‘సర్కార్‌’ అని టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంటోంది. విజయ్‌కు ఇది 62వ చిత్రం. స్వర మాం‍త్రికుడు ఏ ఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. 

ఇళయ దళపతి పుట్టిన రోజు కానుకగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement