ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళనాడు దిగవంత సీఎం జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. అలాగే, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, తమ అభిమాన హీరో సినిమాపట్ల అన్నాడీఎంకే నేతలు వ్యవహరించిన తీరుపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. హీరో విజయ్ చెప్పింది నిజమేనంటూ ‘సర్కార్’ సినిమాలో చూపిన విధంగా.. జయలలిత హయాంలో ఇచ్చిన ఉచిత కంప్యూటర్లు, గ్రైండర్లు, మిక్సీలు, టేబుల్ ఫ్యాన్లు, ఇతర వస్తులవులను మంటల్లో వేసి బూడిద చేశారు. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
Published Sun, Nov 11 2018 10:52 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
Advertisement