విజయ్‌ వేరే లెవల్‌ | Varalaxmi Sarathkumar Prices Hero Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌ వేరే లెవల్‌

Published Tue, Jun 26 2018 9:21 AM | Last Updated on Tue, Jun 26 2018 9:21 AM

Varalaxmi Sarathkumar Prices Hero Vijay - Sakshi

తమిళసినిమా: నటుడు విజయ్‌ వేరే లెవల్‌ అన్నదెవరో తెలుసా? సంచలన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. కోలీవుడ్‌లో బిజీగా ఉన్న నటి ఎవరంటే టక్కున వచ్చే బదులు ఈ బ్యూటీ పేరే. కథానాయకి, ప్రతి కథానాయకి, కీలక పాత్ర ఇలా ఏదైనా సరే పాత్రకు ప్రాధాన్యత ఉందంటే నటించడానికి రెడీ అంటున్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. ఈమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. సండైకోళీ–2 చిత్రంలో విశాల్‌తో కలిసి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ఈమె విజయ్‌ నటిస్తున్న సర్కార్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.

నటుడు విజయ్‌ గురించి వరలరక్ష్మీ చెబుతూ ఆయన్ను చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పింది. విజయ్‌ను నేరుగా చూస్తే చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారని అంది. ఇక కెమెరా ముందుకొచ్చే విజయ్‌ వేరే లెవల్‌ అని పేర్కొంది. మామూలుగా చాలా శాంతంగా ఉండే ఆయనలో అంతలోనే అంత ఆవేశం ఎక్కడి నుంచి వస్తుందని తానే విస్మయం చెందానని చెప్పింది. తాను విజయ్‌తో కలిసి నాలుగు రోజులే నటించానని, త్వరలో అమెరికాలో జరగనున్న షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చెప్పింది. ఇంతకీ ఇందులో వరలక్ష్మీశరత్‌కుమార్‌ పాత్ర ఏమిటన్నది చిత్ర యూనిట్‌ సస్పెన్స్‌గా ఉంచారు.

అయితే సర్కార్‌ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం అని, ఇందులో విజయ్‌ సంపన్న కుటుంబానికి చెందిన పేదల కోసం పోరాడే యువకుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అమెరికా రిటర్న్‌ ముఖ్యమంత్రి కూతురిగా నటిస్తోందన్నది తాజా సమాచారం. విజయ్‌కు కూడా అమెరికా రిటర్నేనట. సర్కార్‌ చిత్రంలో విజయ్, వరలక్ష్మీ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తాజా సమాచారం. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి కీర్తీసురేశ్‌ నాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సర్కార్‌ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement