
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించే స్టామినా ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్. ఇటీవల నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో నిరాశపరిచిన ఈ స్టైలిష్ స్టార్.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాతో పాటు బన్నీ మరో రెండు సినిమాలకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.
చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్నాడట. అంతేకాదు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు బన్నీ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించనున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ను 2019 చివర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరో కొత్త దర్శకుడితోనూ బన్నీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment