అభిమానులకు స్పైడర్‌ గిఫ్ట్‌ | Mahesh Babu's SPYder release confirmed | Sakshi
Sakshi News home page

అభిమానులకు స్పైడర్‌ గిఫ్ట్‌

Published Wed, Apr 26 2017 12:35 AM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

అభిమానులకు స్పైడర్‌ గిఫ్ట్‌ - Sakshi

అభిమానులకు స్పైడర్‌ గిఫ్ట్‌

ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు. అభిమానులకు ఆ రోజు పెద్ద పండగే. ఈ ఏడాది పండక్కి వాళ్లకు పెద్ద బహుమతి ఇవ్వడానికి మహేశ్‌ సిద్ధమవుతున్నారు.

ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు. అభిమానులకు ఆ రోజు పెద్ద పండగే. ఈ ఏడాది పండక్కి వాళ్లకు పెద్ద బహుమతి ఇవ్వడానికి మహేశ్‌ సిద్ధమవుతున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్‌’. మొదట ఈ సినిమాను జూన్‌ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు విడుదల తేదీ మారింది. మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘స్పైడర్‌’ను విడుదల చేయాలని దర్శక–నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్న మాట.

 రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణను వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరపనున్నారు. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదల చేసిన మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారీస్‌ జయరాజ్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement