‘సికందర్’కు సాయం చేయనున్నారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ‘సికందర్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ . సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కాజల్ కూడా ఓ కీలకపాత్రలో నటించనున్నారట. త్వరలోనే ‘సికందర్’ షూటింగ్‌లో ఆమెపాల్గొంటారని బాలీవుడ్ టాక్.
కథ రీత్యా ఈ చిత్రంలో సల్మాన్ కు సాయం చేసేపాత్రలో కాజల్ నటిస్తారట. మరి.. ‘సికందర్’లో కాజల్ భాగమైనట్లేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్‌లో ప్రస్తుతం ‘సికందర్’ చిత్రీకరణ జరుగుతోంది. సాజిద్ నడియాద్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment