
సీతారామం సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఇటీవల తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్-2లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం తమిళ స్టార్ హీరోతో ఆమె జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మావీరన్(మహావీరుడు) చిత్రంతో హిట్ కొట్టిన శివ కార్తికేయన్‌కు జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.
(ఇది చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్)
మావీరన్ సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్ మరో చిత్రానికి ఓకే చెప్పేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈయన నటించనున్నారు. ఈ చిత్రంలో అతని సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే శివ కార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. దీనికి రాజ్‌కుమార్ పెరియ సామి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మేజర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ మరోసారి పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు కాక్కీసట్టై చిత్రంలో పోలీస్ అధికారిగా నటించారు. అదేవిధంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం దర్బార్. ఇందులో రజినీకాంత్ పోలీస్ అధికారిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
(ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు)
ఆ తర్వాత ఏఆర్.మురుగదాస్ చాలా గ్యాప్ తీసుకుని శివ కార్తికేయన్ హీరోగా మరోసారి పోలీస్ కథనే నమ్ముకుని చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్పైడర్ చిత్ర నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతం అందించినట్లు, షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment