నాలుగోసారి... | Vijay and Murugadoss to team up for the fourth time | Sakshi
Sakshi News home page

నాలుగోసారి...

Published Tue, Mar 17 2020 12:38 AM | Last Updated on Tue, Mar 17 2020 12:38 AM

Vijay and Murugadoss to team up for the fourth time - Sakshi

కొన్ని కాంబినేషన్స్‌ చాలా క్రేజీగా ఉంటాయి. అలాంటి  కాంబినేషన్స్‌లో సినిమాలు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు ప్రేక్షకులు. తమిళ హీరో విజయ్‌–దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌లది అలాంటి కాంబినేషనే. ఈ ఇద్దరి కాంబోలో ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్‌’ సినిమాలు విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర  సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ మూడూ పక్కా కమర్షియల్‌ సినిమాలు. కానీ సందేశం కూడా ఉండేట్లుగా చూసుకున్నారు విజయ్, మురుగదాస్‌. ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట.

‘సర్కార్‌’ చిత్రాన్ని నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్‌ నటించనున్న 65వ చిత్రమిది. ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రం ఆడియో వేడుకను చిత్రబృందం సమక్షంలో జరపాలనుకుంటున్నారు. కరోనా కారణంగా భారీ వేడుక రిస్క్‌ అని యూనిట్‌ భావించింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి సినిమా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు ఆగాయి. ఏప్రిల్‌నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో? మరి ‘మాస్టర్‌’ చెప్పిన ప్రకారం ఏప్రిల్‌ 9న వస్తాడా? వాయిదా పడతాడా? చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement