
చెన్నై : తమిళ హీరో దళపతి విజయ్.. దర్శకుడు మురుగదాస్ కలిసి మరో సినిమా చేయనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్.. లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న మాస్టర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌కు 64వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలవ్వాల్సి ఉంది. కాగా మాస్టర్ తర్వాత విజయ్ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తొలుత సుధా కొంగర, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రచారాలు జరిగాయి. (ఆ స్టార్ ప్రేమజంట పెళ్లి వాయిదా!)
తాజా వివరాల ప్రకారం.. విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఏఆర్ మురుగదాస్ దర్వకత్వంలో చేయనున్నారని తెలుస్తోంది. అంతేగాక ఇది 2012లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమాకు సినిమాకు సీక్వెల్‌గా తీయనున్నట్లు సమాచారం. ఇక తుపాకీలో హీరోయిన్ పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్‌నే ఈ సినిమాలోనూ తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఆగష్టులో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇటీవలే మురుగదాస్ రెండు కథలతో విజయ్‌ను సంప్రదించినట్లు, అందులో ఒకటి తుపాకీ సీక్వెల్ అవ్వగా.. విజయ్ దీనికే మొగ్గు చూపినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్పి ఉంది. కాగా విజయ్, మురుగదాస్ దర్వకత్వంలో ఇప్పటికే మూడు సినిమాలు(తుపాకీ,కత్తి, సర్కార్) విడుదలయ్యాయి. (దర్శకుడి ఇంట్లోకి వారసుడు.. పేరేంటో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment