
స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రజినీకాంత్‌తో చేసిన దర్బార్ చిత్రం నిరాశపరచింది. దీంతో ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. ఆ మధ్య విజయ్ హీరోగా చిత్రం చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే విజయ్ ఆయనకు చాన్స్ ఇవ్వడానికి సముఖంగా లేరని తెలిసింది. అదే విధంగా తెలుగులో ఒకరిద్దరు హీరోలతో చిత్రాలు చేయన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇవి కార్యరూపం దాల్చలేదు.
ఈనేపథ్యంలో మురుగదాస్ తదుపరి చిత్రం ఏమిటనేది..? సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈయన బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలతో చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ మురుగదాస్ ఇంతకుముందే గజిని చిత్రంతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
కాగా తాజాగా సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్ హీరోలుగా హిందీలో మల్టీస్టార్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1995లో కరణ్ అర్జున్ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. అయితే పూర్తిస్థాయి చిత్రాన్ని మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. దీంతో మురుగదాస్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment