
అవునా... ఇది నిజమేనా?
...ఇప్పుడు తెలుగు, తమిళ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గాసిప్పురాయుళ్లు ఓ వార్త చెప్పుకుని ఇలానే అనుకుంటున్నారు.
...ఇప్పుడు తెలుగు, తమిళ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గాసిప్పురాయుళ్లు ఓ వార్త చెప్పుకుని ఇలానే అనుకుంటున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందన్నది ఆ వార్త సారాంశం. ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందనేది నిలకడగా తెలుస్తుంది. కానీ, ఈ వార్త నిజం అనడానికి కొంతమంది కొన్ని నిదర్శనాలు చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య చిరంజీవి ‘స్పైడర్’ సెట్‌కి వెళ్లడమే. మహేశ్‌బాబు హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడనే విషయం తెలిసిందే.
మురుగదాస్‌ని కలవడానికే చిరు వెళ్లారన్నది కొందరి ఊహ. చిరు వెళ్లడం వెనక ఆంతర్యం ఏదైనా.. కుమారుడు రామ్‌చరణ్ సినిమా కోసమే అన్నది బలమైన ఊహ. 2006లో ‘స్టాలిన్’ తీయకముందు నుంచే చిరంజీవితో మురుగదాస్‌కు అనుబంధం ఉంది. తమిళంలో మురుగదాస్ తీసిన ‘రమణ’ చిత్రం తెలుగు రీమేక్ ‘ఠాగూర్’లో చిరంజీవి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అప్పుడు చిరంజీవి–మురుగదాస్ కలిశారు. ఇటీవల మురుగదాస్ ‘కత్తి’ని ‘ఖైదీ నంబర్ 150’గా చిరు చేసిన విషయం తెలిసిందే. సో.. తనయుడు రామ్‌చరణ్ కూడా మురుగదాస్ డైరెక్షన్‌లో చేసే ఛాన్స్ లేకపోలేదు.