తమిళసినిమా: నటి త్రిష నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రాంగీ. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను అందించిన ఈ చిత్రానికి ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ ఎం.శరవణన్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సి.సత్య సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రాంగీ చిత్రం ఈనెల 30వ తేదీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ చిత్రం గత ఏడాదే తెరపైకి రావాల్సి ఉంది. సెన్సార్ సమస్యల కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. మొత్తం మీద రివైజింగ్ కమిటీకి వెళ్లి సుమారు 30కి పైగా కట్స్‌తో బయటపడి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
చిత్ర వివరాలు దర్శకుడు తెలుపుతూ నటి త్రిషను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది అని చెప్పారు. కథ నచ్చడంతో త్రిష ఇందులో నటించడానికి అంగీకరించారని తెలిపారు. ఇది యాక్షన్‌తో కూడిన విభిన్న కథా చిత్రం అని పేర్కొన్నారు. ఫ్యామిలీ, కామెడీ, సెంటిమెంట్ యాక్షన్ వంటి అంశాలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపారు. త్రిష యాక్షన్ సన్నివేశాల్లో నటించారని చెప్పారు. ఒక విలేకరి అయిన ఆమె తన అన్నయ్య కూతురికి ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగుతుందన్నారు.
ఆ సమస్య పరిష్కారం అయిన రాంగి చిత్ర కథ విదేశాల వరకు వెళుతుందన్నారు. దీంతో చిత్రం సగభాగం ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరింనట్లు చెప్పారు. చిత్ర విడుదల ఆలస్యం అవుతుండడంతో సెన్సార్ బోర్డ్ సభ్యులు అడిగిన కట్స్‌కు ఓకే చెప్పినట్లు తెలిపారు. చిత్రంలో పార్లర్‌గా కుటుంబ కథా సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటి త్రిష చిత్రాన్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment