
సినిమా: జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు అదే అని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి నయనతార. ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఏమనందనేగా మీ ఆసక్తి. ఈలేడీ సూపర్ స్టార్ నట జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం సంచలనమే. ఎందుకంటే అన్ని సంఘటనలు తన జీవితంలో జరిగాయి. తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటుంది. అలాంటిది ఈ మధ్య ఒక ఆంగ్ల పత్రికకు భేటీ ఇచ్చింది. అది సంచలనంగా మారింది.
తాజాగా ఒక ఎఫ్‌ఎం రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంకా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇందులో తన ప్రేమ వ్యవహారంతో సహా పలు విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సంచలన నటి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్‌కు జంటగా దర్బార్ చిత్రంలో నటించింది. 11 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో గజిని చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో దర్శకుడు తనకు చెప్పిన కథాపాత్ర వేరని, చిత్రంలో చూపించింది వేరని, తనను ఆ చిత్రంలో డమ్మీని చేశారని ఆరోపణలు చేసింది. తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడం అని సంచలన వ్యాఖ్యలు చేసింది. గజిని తర్వాత నయనతార ఇప్పటివరకు మురుగదాస్ దర్శకత్వంలో నటించలేదు. మళ్లీ ఇప్పుడు రజనీకాంత్‌కు జంటగా దర్బార్ చిత్రంలో నటించింది.
మురుగదాస్‌పై మళ్లీ ఆగ్రహించడానికి కారణం దర్బార్ చిత్ర పారితోషికమే కారణం అని సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు నయనతారకు పారితోషికం బాకీ ఉందట. దీంతో ఒక రోజు షూటింగ్‌కు కూడా రాకపోవడంతో హీరో రజనీకాంత్ కూడా ఎదురుచూడాల్సి వచ్చిందట. దర్శకుడు మురుగదాస్ కల్పించుకుని సమాధాన పరిచి నయనతారను నటింపజేసినట్లు టాక్. పారితోషికం చెల్లిస్తేనే నటిస్తానన్న వార్తలు తను ఇమేజ్‌ను డామేజ్ చేస్తాయని నయనతార భావించినట్లుంది. ఈ కారణంగానే నయనతార తన ఇంటర్వ్యూలో మురుగదాస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దర్బార్ చిత్రంలోనూ నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గజనీ చిత్రంతోనే మోసపోయాననుకుంటే మళ్లీ అదే మోసమా అన్న ఆగ్రహంతోనే తాజాగా నయనతార మరోసారి మురుగదాస్‌పై ఆగ్రహించినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడు మురుగదాస్ ఎలా స్పందిస్తారో, దర్బార్ చిత్ర వర్గాల రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment