ముంబయ్‌లో మహేశ్‌.. అదే లొకేషన్‌! | Mahesh babu shooting in thupaki locations | Sakshi
Sakshi News home page

ముంబయ్‌లో మహేశ్‌.. అదే లొకేషన్‌!

Published Sat, Feb 18 2017 11:56 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

షూటింగ్‌ లొకేషన్‌లో మహేష్‌బాబు - Sakshi

షూటింగ్‌ లొకేషన్‌లో మహేష్‌బాబు

సండే హాలిడే! షూటింగులకూ సెలవే. స్నేహితులతో కలసి హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో మహేశ్‌బాబు ఇంటి దగ్గరకు వెళితే.. ఆయన్ను చూసే అవకాశం దక్కుతుందేమో అనుకుంటున్నారా? మహేశ్‌ హైదరాబాద్‌లో ఎక్కడున్నారండీ బాబూ! ఆయన ముంబయ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. ఈ షూటింగ్‌ ఎక్కడ చేస్తున్నారో తెలుసా? విజయ్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ‘తుపాకీ’ సినిమా గుర్తుందా? ఆ సిన్మాలో ఎక్కువ సీన్లు ముంబయ్‌లోనే తీశారు.

ఇప్పుడు సరిగ్గా అక్కడే, అవే లొకేషన్‌లలో మహేశ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అన్నట్టు... ఈ సినిమా ‘తుపాకీ’ సీక్వెల్‌ తరహాలో ఉంటుందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తకు తగ్గట్టు ఇందులో మహేశ్‌బాబు ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ముంబయ్‌లో భారీ ఎత్తున మహేశ్‌బాబు ఇంట్రడక్షన్‌ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణకు ఫారిన్‌ వెళతారట!














(కెమేరామేన్‌ సంతోష్‌శివన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement