రెండు రోజుల్లో మహేష్ ఫస్ట్ లుక్
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఫస్ట్‌లుక్ త్వరలోనే వచ్చేస్తోంది. ఇప్పటికి చాలాసార్లు వాయిదాపడిన ఈ లుక్‌ను ఇక రెండు రోజుల్లో విడుదల చేస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ ఎన్‌వీఆర్ సినిమాస్ ట్వీట్ చేసింది. దాన్ని మురుగదాస్ కూడా నిర్ధారించారు. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహేష్ బాబు 23వ సినిమా ఫస్ట్ లుక్ వస్తోందని, ఆ విషయాన్ని అభిమానులందరూ తమ తమ క్యాలెండర్లలో మార్క్ చేసుకుని ఉంచాలని తెలిపింది. కౌంట్ డౌన్ మొదలైపోయిందని కూడా చెప్పింది. వెంటనే మురుగదాస్ కూడా ఆన్ ద వే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంతవరకు అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. దాంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.
మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 23న ఈ సినిమా రిలీజ్ అవుతుందని దర్శకుడు మురుగదాస్ ఇప్పటికే ప్రకటించాడు. ఉగాది సందర్భంగా తప్పుకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో అభిమానులను శాంతింపచేయడానికి మహేష్ బాబు స్వయంగా కలగజేసుకున్నాడు. మురుగదాస్ మూవీపై తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన మహేష్, అభిమానులు ఇంకాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఇప్పుడు కొత్త డెవలప్‌మెంట్ మీద మాత్రం మహేష్ ఇంకా స్పందించలేదు.
The Countdown Begins!Mark your Calendar!!Set your Time!!#Mahesh23 #ARM11 #FirstLook12Apr17@5pm @ARMurugadoss @urstrulyMahesh
— NVR Cinema (@NVRCinema) 10 April 2017
On the way https://t.co/yvI192f67O
— A.R.Murugadoss (@ARMurugadoss) 10 April 2017