ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ చేయబోయే సినిమాలు ఏంటన్న దానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్‌తో బన్నీ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరగుతున్నా అధికారికంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు.
తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మురగదాస్ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఒక డైరెక్టర్ చాలామంది హీరోలతో చర్చలు జరుపుతుంటారు. అలాగే హీరోలు కూడా. ప్రారంభ దశల్లొ ఉన్న ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ప్రకటించలేము. అన్నీ అనుకున్నట్లు జరిగితే తప్పకుండా చెబుతాను' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment