
తమిళసినిమా: విజయ్, ఏఆర్.మురుగదాస్‌ల టీమ్‌కు అమెరికాకు బయలదేరనుందన్న తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్ 62వ చిత్రం షూటిం గ్ వడివడిగా పూర్తి చేసుకుంటోంది. తుపాకీ, కత్తి చిత్రాల తరువాత విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటి కీర్తీసురేశ్ కథానాయకిగానూ, వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రతినాయకి పాత్రలోనూ నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటుడు రాధారవి, పళ.కరుప్పయ్య రాజకీయవాదులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర షూటింగ్ ఇప్పటికి 70 శాతం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. జూలైలోపు చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించారు. త్వరలోనే చిత్ర యూనిట్ అమెరికాకు పయనం కానుంది. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు. అయితే ఆ రోజు ఆయన అమెరికాలో ఉంటారు.
పుట్టిన రోజు వేడుకలు రద్దు
విజయ్ పట్టిన రోజు అంటే ఆయన అభిమానులకు పండగ రోజే. ఆ రోజు విజయ్ పేరుతో ఆలయాల్లో పూజలు, వాడవాడలా పోస్టర్లు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు అంటూ హంగామా చేస్తారు. అయితే ఈ సారి అలాంటివేమీ వద్దని విజయ్ తన అభిమానులకు చెప్పినట్లు సమాచారం. కారణం ఇటీవల తూత్తుకుడి కాల్పుల సంఘటనేనట. అదే విధంగా పుట్టిన రోజున తాను అమెరికాలో షూటింగ్‌లో ఉంటాను కాబట్టి అభిమానులెవరూ తనను కలవడానికి చెన్నైకి రావద్దని, అయితే ప్రశాంతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా విజయ్ తన అభిమానులకు పిలుపునిచ్చినట్లు తెలిసింది. దీని గురించి ఆయన త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.