ధీరుడు రెడీ | Dheerudu is ready | Sakshi
Sakshi News home page

ధీరుడు రెడీ

Published Tue, Mar 11 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

ధీరుడు రెడీ

ధీరుడు రెడీ

విశాల్ హీరోగా రూపొందిన చిత్రం ‘ధీరుడు’.
 ఈ సినిమా ద్వారా నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య కథానాయికగా పరిచయం అవుతున్నారు. భూపతి ప్యాండన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని విశాల్ నిర్మించారు. ఈ 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ -‘‘యాక్షన్, లవ్, కామెడీ సమాహారంతో రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. కథ, కథనం ప్రధాన బలాలు కాగా, అనల్ అరసు సమకూర్చిన ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
 
 థమన్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఓ మంచి మ్యూజికల్ హిట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. అన్ని వర్గాలవారిని మెప్పించే ఈ చిత్రం విశాల్‌కి మరింత మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం: వడ్డీ రామానుజం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement