మెగా 151పై మరో అప్డేట్..! | Thaman Music for Mega 151 Uyyalawada narasimha reddy | Sakshi

మెగా 151పై మరో అప్డేట్..!

Apr 9 2017 10:34 AM | Updated on Sep 5 2017 8:22 AM

మెగా 151పై మరో అప్డేట్..!

మెగా 151పై మరో అప్డేట్..!

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమా మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమా మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి రామ్ చరణ్ నిర్మాణంలోనే సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఇప్పటికే మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఓకె చేశాడన్న ప్రచారం జరుగుతుంది. యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ రిజిస్టర్ చేయించడంతో మెగా 151 సినిమా ఇదే అన్న టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ హీరోగా ధృవ లాంటి క్లాస్ హిట్ ను అందించిన సురేందర్ రెడ్డి మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటికే మెగా 151 పనుల్లో బిజీ అయిన సూరి, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించాడన్న టాక్ వినిపిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి దిగిన సెల్ఫీని ట్వీట్ చేసిన తమన్, 'నా కిక్.. నా రేసుగుర్రం.. మరి ఇప్పుడు..???' అంటూ కామెంట్ చేశాడు. దీంతో అభిమానులు తమన్, మెగా మూవీపై హింట్ ఇచ్చాడని సంబరపడిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement