చిరు.. నరసింహారెడ్డి లుక్..! | Mega Star Chiranjeevi Uyyalawada Narasimha reddy Look | Sakshi
Sakshi News home page

చిరు.. నరసింహారెడ్డి లుక్..!

Published Wed, Mar 22 2017 10:15 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

చిరు.. నరసింహారెడ్డి లుక్..!

చిరు.. నరసింహారెడ్డి లుక్..!

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు 151వ సినిమాకు రెడీ అవుతున్నాడు. హిస్టారికల్ జానర్లో తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాను తన 151వ చిత్రంగా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ కథపై చాలా రోజులుగా కసరత్తులు చేస్తున్న మెగా టీం ఫైనల్గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు డిసైడ్ అయ్యింది. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. మెగా 151 మూవీ ఇదే అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఫిక్స్ అయిపోయారు.

ఇప్పటికే ఫైనల్ వర్షన్ కథ కూడా రెడీ చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం చిరంజీవి లుక్ మీద కసరత్తులు చేస్తున్నాడు. తొలి స్వతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా, చిరు ఎలా కనిపించాలో స్కెచ్లు గీయిస్తున్నారు. అలా గీయించిన స్కెచ్లలో ఒకటి బయటికి వచ్చింది. నిజంగానే ఇది యూనిట్ సభ్యులు గీయించిందా.. లేక ఎవరైనా ఫ్యాన్స్ రెడీ చేశారో తెలియదుగాని.. ఈ లుక్లో చిరు మాత్రం సూపర్బ్గా ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement