ఇక షురూ! | Akhil is so happy to work with Thaman | Sakshi
Sakshi News home page

ఇక షురూ!

Published Fri, Mar 23 2018 12:12 AM | Last Updated on Fri, Mar 23 2018 12:12 AM

Akhil is so happy to work with Thaman - Sakshi

తమన్, అఖిల్, వెంకీ అట్లూరి

ఈ ఏడాది ఉగాది రోజున స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు యంగ్‌ హీరో అఖిల్‌. తన తర్వాతి చిత్రాన్ని ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎన్‌ఎస్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా వర్క్‌ షురూ అయ్యింది.

‘‘న్యూ బిగినింగ్స్‌. ఫ్రెండ్స్‌ వెంకీ అట్లూరి, తమన్‌ని కలిశాను. వాళ్ల గురించి పూర్తిగా తెలసుకుంటాను. మేమంతా మంచి టీమ్‌ వర్క్‌ చేసి బెస్ట్‌ అవుట్‌పుట్‌ రావడానికి కష్టపడతాం’’ అన్నారు అఖిల్‌. ‘‘మంచి ఎనర్జీతో, మంచి ఆలోచనలతో కొత్త సినిమా పని ప్రారంభించాం’’ అన్నారు వెంకీ అట్లూరి. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం బ్యాంకాంక్‌లో జరుగుతుందని సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement