'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? | Mahesh Babu Guntur Kaaram Movie New Song Promo Released, Kurchi Tatha Remuneration Details - Sakshi
Sakshi News home page

Guntur Kaaram Kurchi Madathapetti Song: 'కుర్చీ మడతపెట్టి' పాట కోసం తాతకు అంత డబ్బిచ్చిన తమన్

Published Sat, Dec 30 2023 11:48 AM | Last Updated on Sat, Dec 30 2023 1:12 PM

Guntur Kaaram New Song Kurchi Tatha Remuneration Details - Sakshi

'గుంటూరు కారం' నుంచి తాజాగా ఓ మాస్ పాట ప్రోమోని రిలీజ్ చేశారు. అభిమానులకు సాంగ్ నచ్చడం సంగతి పక్కనబెడితే ఊహించని విధంగా ఈ గీతం.. కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది.  అసలు ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న మహేశ్ బాబు.. ఇలాంటి పాటని ఎలా అంగీకరించాడా అని మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో పాట ఓనర్ కుర్చీ తాత గురించి, పాట కోసం అతడికిచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా డిస్కషన్ చేస్తున్నారు.

మహేశ్ బాబు కొత్త సినిమా 'గుంటూరు కారం'. దర్శకుడు త్రివిక్రమ్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు పాటలు రాగా అందులో 'దమ్ మసాలా' శ్రోతల్ని ఆకట్టుకోగా.. 'ఓ మై బేబీ' పాటపై ఓ రేంజులో ట్రోలింగ్ జరిగింది. తాజాగా మాస్ గీతం అని చెప్పి 'కుర్చీ మడతపెట్టి' అని సాగే ఓ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్-శ్రీలీల స్టెప్పులు బాగానే వేసినప్పటికీ లిరిక్స్‌పై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'సలార్' రూట్‌లోనే 'గుంటూరు కారం'.. ప్లాన్ బాగుంది కానీ?)

హైదరాబాద్‌లోని కాలా పాషా అనే ఓ తాత.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి చెబుతూ 'కుర్చీ మడతపెట్టి..' అని బూతు పదంతో కూడిన లైన్ వాడాడు. ఇది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఇతడు కుర్చీ తాతగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడు మాటల్ని తమన్ పాటగా మార్చేశాడు. అయితే ఇందుకోసం కుర్చీతాతకు దాదాపు రూ.5 వేల ఇచ్చాడు తమన్. ఈ విషయాన్ని స్వయంగా సదరు ముసలాయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

ఇకపోతే ప్రోమోకే ఈ రేంజు ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న 'గుంటూరు కారం' టీమ్.. జనవరి 12న సినిమా రిలీజయ్యేలోపే ఇంకెన్ని విమర్శలు ఎదుర్కొంటుందో ఏంటో? మహేశ్-శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాని తల్లి-కొడుకు సెంటిమెంట్ ప్లస్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రీసెంట్‌గానే షూటింగ్ పూర్తి చేసుకుంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement