చిరు సినిమాకు తమన్ మ్యూజిక్ | Thaman Bags Chiranjeevi 151 film | Sakshi
Sakshi News home page

చిరు సినిమాకు తమన్ మ్యూజిక్

Published Tue, Aug 2 2016 12:11 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

చిరు సినిమాకు తమన్ మ్యూజిక్

చిరు సినిమాకు తమన్ మ్యూజిక్

తెలుగు సినీ రంగంలో పనిచేస్తున్న ప్రతీ సాంకేతిక నిపుణుడు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయాలనుకుంటారు. ఇక యంగ్ జనరేషన్ టెక్నిషియన్స్ అయితే చిరు చాన్స్ ఇస్తే చాలని ఎదురుచూస్తుంటారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్.., మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తలుపు తట్టింది. స్వయంగా చిరంజీవే తన నెక్ట్స్ సినిమాకు.. తమన్ సంగీత దర్శకుడంటూ ప్రకటించాడు.

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీరస్తు శుభమస్తు పాటలు చాలా బాగున్నాయన్న చిరు, తన నెక్ట్స్ సినిమాకు తమన్ సంగీతమందిస్తాడంటూ సభాముఖంగా ప్రకటించాడు. ఇప్పటికే అందరు అగ్రహీరోలతో కలిసి పనిచేసిన తమన్, చిరు సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తే ఇక అందరు హీరోలను కవర్ చేసినట్టే.

ప్రస్తుతం తన 150 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఇన్నాళ్లు హీరోయిన్ ఫైనల్ కాకపోవటంతో కాస్త స్లోగా నటించిన షూటింగ్ పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. అనుకున్నట్టుగా జనవరి నాటికి సినిమాను సిద్ధం రెడీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. వెంటనే తన 151వ సినిమాను కూడా మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement