
ప్రస్తుతం ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) ఒకడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా తేడా లేకుండా దాదాపు చాలా భాషల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతడు ప్రభాస్ 'రాజాసాబ్' (The Rajasaab Movie) కోసం కూడా పనిచేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ కోసం చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, కొత్తగా మళ్లీ చేస్తున్నానని అన్నాడు. ఇంతకీ ఏమైంది?
(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి సింగర్ మంగ్లీ.. ఫొటోలు వైరల్)
ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ చాలా విషయాలు మాట్లాడాడు. కానీ 'రాజాసాబ్' పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. 'రాజాసాబ్'కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు'

'ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ చేయబోతున్నారు. రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాట చేస్తున్నాం. నిజానికి 'రాజాసాబ్' కోసం చాలా పాటలు చేశారు. కానీ నాకెందుకో మార్చేద్దాం అనిపించింది. ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చా. వాళ్లు షూటింగ్ మొదలుపెట్టలేదు. దీంతో ఇవన్నీ డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా. డైరెక్టర్ కి కూడా ఇదంతా చెప్పా. ఇవి ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని చీట్ చేయలేను. ఇలా ఉండటమే కరెక్ట్' అని తమన్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)
Comments
Please login to add a commentAdd a comment