లవ్‌తో లవ్వాట!
‘లవ్’ ఎలా ఉంటాడో? అతడి లుక్ ఎలా ఉంటుందో? ఇంకా తెలీదు గానీ... ఇదిగో ఈ లవ్ లేడీ లుక్కు మాత్రం మీకోసం! అబ్బబ్బా... చీర కట్టి, ముత్యం లాంటి బొట్టు పెట్టి, అంతకంటే అందమైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్ తో ప్రేక్షకులపై మన్మథబాణం వదిలినట్టుంది కదా రాశీ ఖన్నా లుక్కు! ఈ లుక్ చూసే ‘లవ్’ కూడా ఈమెతో లవ్వులో పడినట్టున్నాడు. ఇంతకీ, ఈ ‘లవ్’ ఎవరండీ? టాపిక్ స్టార్ట్ చేసినప్పట్నుంచి లవ్... లవ్... అంటూ డీటీఎస్‌లో మరీ చెబుతున్నారని అనుకుంటున్నారా? యంగ్ టైగర్ ఎన్టీఆరే లవ్.
కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ‘జైలవకుశ’లో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముగ్గురిలో ఓ క్యారెక్టర్ పేరు లవ్ అలియాస్ ఎన్. లవకుమార్. అతడి ప్రేయసి పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఎన్టీఆర్, రాశీలపై సీన్స్ తీస్తున్నప్పుడు సెట్స్‌లో తీసిన ఫొటోనే మీరు చూస్తున్నారు. జస్ట్... ఇది శాంపిల్ మాత్రమే. ఫుల్ పిక్చర్ బాకీ హై!!