ఎన్‌ అంటే నందమూరి అనేనా? | harikrishna meets ntr on sets | Sakshi
Sakshi News home page

ఎన్‌ అంటే నందమూరి అనేనా?

Published Sat, Mar 25 2017 12:35 AM | Last Updated on Wed, Aug 29 2018 12:56 PM

ఎన్‌ అంటే నందమూరి అనేనా? - Sakshi

ఎన్‌ అంటే నందమూరి అనేనా?

నందమూరి హరికృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన కుమారులు కల్యాణ్‌ రామ్, ఎన్టీఆర్‌... హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సంతోషానికి అదో కారణం. ఇంకో కారణం ఏంటంటే.. వీళ్లిద్దరూ కలసి ఓ సినిమా చేస్తున్నారు. తమ్ముడు ఎన్టీఆర్‌ హీరోగా అన్నయ్య కల్యాణ్‌రామ్‌ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మీరు చూస్తున్నది... హరికృష్ణ సరదాగా లొకేషన్‌కి వెళ్లినప్పుడు తీసిన ఫొటో.

దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే... టేబుల్‌ పైన ఉన్న నేమ్‌ ప్లేట్‌ మీద ‘ఎన్‌. లవ కుమార్‌’ అనే పేరు కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారనీ, ఓ పాత్ర పేరు ‘జై’, మరో పాత్ర పేరు ‘లవ’, మూడో పాత్ర పేరు ‘కుశ’... అందుకే సినిమాకు ‘జై లవ కుశ’ టైటిల్‌ ఖరారు చేశారనీ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ‘ఎన్‌. లవకుమార్‌’ పేరు చూస్తోంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది. పేరు పక్కన పెడితే... సినిమాలో హీరో ఇంటి పేరు ‘ఎన్‌’ అంటే నందమూరి అనేనా? వెయిట్‌ అండ్‌ సీ!

స్పెషల్‌ హంస!http://img.sakshi.net/images/cms/2017-03/51490382694_Unknown.jpg
ఈ సినిమాలో రాశీ ఖన్నా ఓ హీరోయిన్‌. ఆమెతో పాటు మరో ఇద్దరికి చోటుంటుంది. ముగ్గురు హీరోయిన్లు కాకుండా మరో అందాల భామ హంసా నందిని ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె ఐదు రోజులు చిత్రీకరణలో పాల్గొన్నారు. ఓ పాటతో పాటు కీలక సన్నివేశాల్లో హంస కనిపిస్తారట. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘లెజెండ్‌’, ‘లౌక్యం’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’... హంస స్పెషల్‌గా కనిపించిన సినిమాలన్నీ హిట్టే. ఆ విధంగా ‘లక్కీ గాళ్‌’ అనే పేరు తెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement