ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతీ సినిమా ప్రమోషన్ కు బిగ్ బాస్ హౌస్ వేదికవుతోంది. ఇప్పటికే పలువురు హీరోలు బిగ్ బాస్ హౌస్ లో కొంత సమయం గడిపి తమ సినిమాలకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నారు. అదే బాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నడవబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్, తన సినిమా ప్రమోషన్లో భాగంగా ఇద్దరు హీరోయిన్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నాడు.