
జై లవ కుశ : రెండో టీజర్ రెడీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై లవ కుశ. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చాయి. ముఖ్యం గా జై పాత్రకు సంబంధించిన టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది.
తాజాగా సినిమాలో రెండో పాత్ర లవ కుమార్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 25న వినాయక చవితి సందర్భంగా లవ కుమార్ టీజర్ రిలీజ్ కానుంది. తొలి టీజర్ లో ఎన్టీఆర్ లుక్స్, డైలాగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరి రెండో టీజర్ మరోసారి అదే హైప్ తీసుకురావటంలో చిత్రయూనిట్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.