ఈద్కు జూనియర్ ట్రీట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేశాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి కావటంతో టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ లో ఒక పాత్రకు సంబంధించిన లుక్ మాత్రమే రివీల్ కావటంతో మిగతా పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది.
ఈ ప్రశ్నలన్నింటికీ ఈద్ సందర్భంగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఈద్ కానుకగా సినిమా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నివేథా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.